#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

దేనికి నేనే దాని వెంట పరుగెడితే సరిపోదా అని దాన్ని అనుసరిస్తూ పోతుంటుంది ధ్యానం. ఇదీ ఇవి రెండూ చెట్టపట్టాలు పట్టుకొని నడవటంలో ఉన్న ఆంతర్యం. అయితే ఎంత గొప్ప సాధన అయినా ధ్యానం ధ్యానమే జ్ఞానం జ్ఞానమే. అది దీనితో కలిసి ప్రవహించి నప్పుడే దానికి సార్ధక్యమని సూచించటానికి మహర్షి చివరకీ అధ్యాయం ధ్యాన మార్గంతో ముగించి దీని వెంటనే దీనికి పరిపూర్ణత నిచ్చే జ్ఞాన మార్గాన్ని అద్భుతంగా వర్ణించబోతాడు రాబోయే అధ్యాయంలో. అది రాజ విద్య రాజ గుహ్యం - మామూలు విద్యగాదు. మామూలు అనుభవం కాదు. ఇదీ సమన్వయం.

  పోతే ప్రస్తుతం మరలా జ్ఞానాన్నే వర్ణిస్తున్నాడు. తస్మాత్సర్వేషు కాలేషు మా మనుస్మర. నిరంతర భావనా జన్యమైన సంస్కారమే తదను రూపమైన ఫలితాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తుంది. కాబట్టి నీవొక పని చేయి. అదీ ఇదీ దేనికి నీకు. అసలైన మోక్షఫలమే కావాలి కాబట్టి నీకు దానికోసం డొంక తిరుగుడు ధ్యానం దేనికి. సూటిగా అందించే జ్ఞానాన్నే పట్టుకో సరిపోతుంది. అది ఎలాగా అని అడగవచ్చు నీవు. మా మనుస్మర. నన్నే స్మరిస్తూ ఉండు. మామేవ అని ఇంతకు ముందూ చెప్పా డిప్పుడూ చెబుతున్నాడు. యద్భావ స్తద్భవతి అని సామెత. భ్రమర కీట న్యాయంగా నీ మనసేది నిత్యమూ స్మరిస్తూ పోతుందో దాని అనుభవమే నీ కేర్పడుతుంది. ఉపాసనలో ఉన్న మర్మమదే గదా. దేవతోపాసన చేస్తే

Page 120

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు