#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

జరిగే మార్పిది. బాహ్యంలో కాదు. ఇదీ జ్ఞానీ ధ్యానీ ఇద్దరి విషయంలో ఉన్న పెద్ద తేడా. ఇంత దూరం విచారణ చేసి అర్థం చేసుకో వలసిందే గాని పైపైన చూస్తే తెలిసేది గాదిది.

తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ
మయ్యర్పిత మనోబుద్ధి - ర్మామే వైష్య స్యసంశయః -7


  మళ్లీ ఇప్పుడు జ్ఞాని విషయమే వర్ణిస్తున్నాడు. దీనివెంటనే మరలా ధ్యాని విషయం వర్ణిస్తాడు. ఇంతకు ముందూ అలాగే చేశా డిప్పుడూ అలాగే చేస్తున్నాడు. జ్ఞానం ధ్యానం రెండూ మార్చి మార్చి వర్ణిస్తుంటాడు. ఇప్పుడే గాదు. ఈ అధ్యాయం పూర్తి అయ్యేవరకూ ఇలాగే నడుస్తుంటుంది చాలావరకు. చూడబోతే ఈ ధ్యానంలో పడి జ్ఞానాన్ని ఎక్కడ మరచిపోతారో సాధకులేమయి పోతారోనని పరమాత్మకు బెంగ పట్టుకొన్నది. జ్ఞానమే ప్రధాన మెప్పటికైనా. స్వతంత్రంగా మోక్షాన్ని ప్రసాదించేది అదే. కాగా ధ్యానమనేది జ్ఞానం ద్వారా అందివ్వ వలసిందే గాని తనపాటికి తాను ప్రసాదించలేదు. అందుకే అది సద్యోముక్తి అయితే దీన్ని క్రమముక్తి అని పేర్కొన్నార ద్వైతులు. అయితే ఒక మాట. క్రమ ముక్తి అయినా ఇది జ్ఞానానికి తోడ్పడుతుందీ ధ్యానమనే సత్యాన్ని మనం మరచిపోరాదు. అది మనకు గుర్తు చేయటానికా అన్నట్టు ఇదీ అదీ కలిపి ఏకరువు పెడుతుంటాడు మహర్షి. ధ్యానం తన వెంట వస్తున్నదా లేదా అని వెనక్కు తిరిగి దాన్ని చేయి పట్టుకొని నడుస్తుంటుంది జ్ఞానం. అంతవరకు తాత్సారం చేయటం

Page 119

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు