#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

వచ్చాడు. అలాటి మనస్తత్త్వంతో యావజ్జీవమూ జీవించిన జ్ఞాని ప్రారబ్ధం తీరి శరీరమనే ఉపాధి వదిలేసిన తరువాత ఇక ఏ దేశంలో ఏకాలంలో ఎక్కడికి ప్రయాణమయి పోయి ఏ లోకమనే గమ్యం చేరాలి. దేనితో ఏకమై పోవా లంటారు. అలా చెబితే ఎంత హాస్యాస్పదం. బ్రహ్మమనేది ఎక్కడ లేదు. ఎప్పుడు లేదు. ఏదిగాదు. వాడి స్వరూపం కూడా బ్రహ్మమే గదా.

  అయితే మరి మామేవ స్మరన్ యః ప్రయాతి స మద్భావం యాతి అని ఎలా చెప్పాడు వ్యాస భట్టారకుడు. ధ్యానికి చెప్పినట్టే చెప్పాడు గదా జ్ఞానికి కూడా. నిజమే చెప్పాడు. కాని అది లోకవ్యవహార రీత్యా చెప్పిన మాటే. పరమార్ధ దృష్టితో అన్నమాట కాదు. అనువాదమే గాని విధానం గాదని ఇంతకుముందే పేర్కొన్నాము మేము. కాకపోయినా బ్రహ్మ మిప్పుడూ ఉంది అప్పుడూ ఉంది గదా. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా విస్తరించి ఉంది గదా. ఇక క్రొత్తగా ఎక్కడికి వెళ్లి అందుకొంటాడు. ఎప్పుడు వెళ్లి అందుకొంటాడు. ఎలా వెళ్లగల డసలు. మరి వెళ్లుతాడు పొందుతాడనే మాట ఎలా సమర్ధిస్తారని అడిగితే దానికి భగవత్పాదు లొకే ఒక సమాధాన మిస్తారు తమ ఉపనిషత్సూత్ర భాష్యాదుల్లో. రోగార్త స్యేవ రోగ నివృత్తా స్వస్థతా అని మాండూక్య భాష్యం. ఒక వ్యక్తికి రోగం లేనంత వరకూ ఉన్న దారోగ్యమే. మధ్యలో రోగక్రిములు లోపల ప్రవేశించి అనారోగ్యం పాలయ్యాడు. అది ఎంతో కాల ముండదా అనారోగ్యం. తగిన చికిత్స చేయించామంటే శరీరంలో సంక్రమించిన ఆ క్రిములన్నీ నశించి మరలా

Page 117

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు