#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ముంది. అది దేశకాలాల్లోనే జరగవలసి ఉంది. చివరకు తాను వెళ్లి చేరే గమ్యస్థాన మొకటి ఉంది. అది ఏదో గాదు. ఆ దేవత ఆధిపత్యం వహించే లోకం. ఇంత కలాపముంది ధ్యానికి. ఇవన్నీ దేనిపాటి కది వేరు వేరనే భావనే ఉంది వాడికి. వేరుగానే దర్శన మిస్తుంటాయి కూడా వాడికి. కనుక ప్రయాణమంటే ప్రయాణమే వీడిది.

  కాగా జ్ఞాని వ్యవహారమిలాంటిది గాదు. ప్రయాతి - యాతి అని వర్ణించినా అది ప్రయాణం కాదు వాస్తవంలో. ప్రయాణం గాని ప్రయాణమది. కలలో మనమొక గ్రామం నుంచి మరో గ్రామానికి ప్రయాణమయి పోయా మనుకోండి. అది నిజమైన ప్రయాణమా. నిజమైన ప్రయాణమైతే తెల్లవారిన తరువాత ఆ గ్రామంలోనే ఉండాలి మనం. లేదే. ఎక్కడ పడుకొని నిద్ర పోయామో అక్కడే మేలుకొంటాము. అక్కడే ఉన్నామనుకొంటాము. అలాగే ఇదీ. కారణ మేమంటే జ్ఞాని భావిస్తున్న బ్రహ్మమే హిరణ్యగర్భుడో ఏ ఇంద్రుడో చంద్రుడో గాదు. ఇంద్రుడు చంద్రుడైతే వాడికొక ఉపాధి ఉంది. ఒక లోకముంది. మనకూ వాడికీ బ్రహ్మండమైన దూరముంది. మరి బ్రహ్మమో. అది నిరుపాధికం. సర్వగతం. సర్వానన్య మైన పదార్ధం. ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడే వస్తువంటే ఆ వస్తువుగా ఉన్నదదే. దానికి దేశకాల వస్తువు లనేవి వేరుగా లేవు. అవి కూడా బ్రహ్మమే. అలాటి పరిపూర్ణమైన తత్త్వాన్ని భావన చేస్తున్నాడు జ్ఞాని. తదాకారమైన చిత్తవృత్తితో దాన్నే తన కభిన్నంగా దర్శిస్తూ

Page 116

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు