కనన్యంగా భావిస్తుంటాడు నిత్యమూ. చివరకా భావన వదలకుండానే దేహత్యాగం చేసి బ్రహ్మ సాయుజ్యం పొందుతాడు. పోతే ధ్యాని అలా కాదు. వీడు సర్వవ్యాపకమైన బ్రహ్మాన్ని కాదు. ఆ బ్రహ్మ చైతన్యంలో ఏకదేశమైన Partఒక హిరణ్య గర్భ చైతన్యమే సర్వస్వమని భావించి అది కూడా సగుణంగా తన కన్యంగా దర్శిస్తూ ఆ భావనతోనే చివరకు శరీరం వదిలేసి వెళ్లుతాడు. వాడి భావన కనురూపమైన ఆ దేవతా రూపంతోనే ఏక మవుతాడు. ఒకడి దద్వైత సాధన. మరొకడిది ద్వైత సాధన. మొదటనే చెప్పాము జ్ఞాన మద్వైతం. ధ్యానం ద్వైతమని. దాని కనుగుణంగా నడుస్తుంది వారి ప్రవర్తన. కనుకనే జ్ఞాని విషయంలో మామేవ అని ఉంటే ధ్యాని విషయంలో యం యం వాపి భావమని తేడాగా కనిపిస్తాయి మాటలు. అక్కడ మామంటే బ్రహ్మం. పరమాత్మ అని అర్ధం. ఇక్కడ భావమంటే పరమాత్మ కాదు. దాని చైతన్య శకలాలైన తత్తద్దేవతా మూర్తులు. ఒకటి సమష్టి చైతన్యం. మరొకటి వ్యష్టి చైతన్యం. ఒకటి జీవ చైతన్యాని కభిన్నం. ఇంకొకటి కేవలం విభిన్నం. మరి రెండూ ఒకటెలా అవుతాయి.
అంతేకాదు. ఇంకొక ముఖ్యమైన తేడా ఉంది వీరిలో. శరీరాన్ని త్యాగం చేసి వెళ్లిపోవట మిద్దరికీ సమానమే అయినా ఆ అంతిమ ప్రయాణ మిద్దరిదీ ఒకటి గాదు. ఉపాసకుడు దేశకాలల్లో Space & Time చేస్తాడు ప్రయాణం. అలా ప్రయాణం చేసి ఆయా దేవలోకాలకు వెళ్లి ఆ ఇష్ట దేవతా సాయుజ్యం చెందుతాడు. వాడొక యాత్రికుడు. వాడికొక ప్రయాణ
Page 115