#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ముక్త్వా కళేవరం త్యజ త్యంతే కళేవర మని స్వతంత్రంగానే శరీర త్యాగం చేస్తాడనే మాటా సమానమే. పోతే యాతి - ఏతి అనే క్రియాపదం కూడా సమానార్ధకంగానే ప్రయోగించాడు మహర్షి యాతి అన్నా ఏతి అన్నా చేరుతున్నాడు పొందుతున్నాడనే అర్ధం. కాగా తద్భావ భావితం అనే మాట మొదటి దానిలో కాకపోయినా అది కూడా అక్కడ గుప్తంగా ఉన్నట్లే భావించాలి మనం. ఎందుకంటే అలాటి భావనా సంస్కారం లేకపోతే ఏ ఒక్కటీ సిద్ధించదు మానవుడికి. అటు ధ్యానానికైనా ఇటు జ్ఞానానికైనా రెండింటికీ అవసరమే అది. ఇంతెందుకు రాబోయే శ్లోకమే దీనికి నిదర్శనం. తస్మా త్సర్వేషు కాలేషు మామనుస్మర అని జ్ఞానికి కూడా సర్వకాల సర్వావస్థలలో స్మరణ ఉండి తీరాలని చెప్పబోతున్నది. అదేగదా సదా తద్భావ భావన. భాష ఏదైతే నేమిటి. అర్థ మొక్కటే. కాబట్టి రెండూ అన్నదమ్ముల లాగా నడుస్తున్నాయీ శ్లోకాలు.

  కాని అది ఆపాతతః Superficial మనకు కనిపిస్తున్న సాదృశ్యమే. శబ్ద సామ్యమే గాని అర్ధంలో గాదని గ్రహించాలి మనం. కారణ మేమంటే మొదట చెప్పినవాడు జ్ఞాని. రెండవ దానిలో చెప్పినవాడు ధ్యాని. జ్ఞానం వేరు ధ్యానం వేరు. రెంటికీ హస్తి మశకాంతర ముంది. జ్ఞానీ స్మరిస్తాడు. ధ్యానీ స్మరిస్తాడు. కాని జ్ఞాని మామేవ నన్నే స్మరిస్తాడంటున్నాడు గమనించండి. వాడు సర్వవ్యాపకమైన అధ్యాత్మం మొదలూ అధిదైవాధి భూతాల వరకూ విస్తరించి ఉన్న పరతత్త్వాన్నే తన స్వరూపంగా తన

Page 114

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు