#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

Technical term. ముఖ్యంగా ఆయుర్వేద గ్రంధాలలో కనిపిస్తుందిది. భావన అల్లం భావన జీలకఱ్ఱ అనే మాట విని ఉంటారు మీరు. ఒక వస్తువు గుణం వేరొక వస్తువుకు పట్టించటానికి భావన అని పేరు. అలా దీని గుణం దానికి సంక్రమిస్తే ఇక తేడా రాదు. అదీ ఇదీ ఒకటే అవుతుంది. లోకంలో కూడా చూడండి. అంటు తొక్కటమని ఒక వ్యవహారముంది. ఒక మొక్కకు మరొక మొక్క చేర్చి కడితే అది దీని మాదిరే తయా రవుతుంది. ఇంగువ కట్టిన బట్టలాంటిదని కూడా అంటారు. ఇంగువ అంతా ఖర్చయిపోయినా ఆ గుడ్డ నీళ్లలో తడిపి ఆరేసినా ఇంకా ఆ వాసన వస్తూనే ఉంటుంది కొంచెం. దీనినే వేదాంతులు వాసన అనీ సంస్కారమనీ పేర్కొంటారు. భావన వల్లనే ఏర్పడుతుందది. అది ఏ ఉపాసనా లేనివాడికి మరణానంతరం ఆ సంస్కారానికి తగిన జన్మే ఇస్తుంది. ఉపాసకుడే అయితే ఏ దేవత నా రాధిస్తూ వచ్చాడో ఆ దేవతా వాసనే ఉంటుంది కాబట్టి దాని కనురూపంగా ఆ దేవతా సాయుజ్యమే లభిస్తుంది. ఇదీ ఇందులో ఉన్న ఉపపత్తి.

  పోతే ఇప్పు డిక్కడ రెండు శ్లోకాలు పక్కపక్కనే వచ్చాయి. అంత కాలేచ మామేవ స్మరన్ అని ఒకటి. యం యం వాసి స్మరన్ భావమని ఒకటి. రెండింటికీ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అక్కడా స్మరన్ ఇక్కడా స్మరన్ అని ఉభయత్రా స్మరిస్తున్నాడు వేదవ్యాసుడు. అంత కాలే. అంతే అని రెండుచోట్లా మరణకాలం కూడా సమానంగానే వర్ణించాడు. మరి

Page 113

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు