అక్షరం బ్రహ్మ పరమమని మొదటి ప్రశ్నకు సమాధాన మదేగదా. మరి
ఆ బ్రహ్మమే స్వరూప స్థితిలో అచలమైన జ్ఞానమే అయినా ఆ జ్ఞానం
తత్తదుపాధుల ద్వారా బయటికి ప్రసరించి నప్పుడదే కర్మ అవుతున్నది.
కాబట్టి ఇదీ బ్రహ్మమే. సూర్యమండలం స్వరూపమైతే నలుమూలలా
వ్యాపించిన దాని ప్రకాశం కర్మ అయితే - అదే ఒక ఇంద్రధనుస్సుగా
మూర్తీభవించిం దనుకోండి. అదే ఈ చరా చర ప్రపంచం. తేడా ఏముంది.
కాగా నిర్గుణమైన ఆ చైతన్యమే సగుణ రూపంగా సమస్త ప్రపంచాన్నీ
వ్యాపిస్తే అది అధి దైవతం. హిరణ్యగర్భుడు. మరి అధి యజ్ఞ మేదో
గాదు. ఆ బ్రహ్మమే ఈ జీవుడి దేహంలో వచ్చి కూచొని దీనితో తాదాత్మ్యం
చెందితే అదే అధియజ్ఞం. పోతే ఇక రేపు అవసాన దశలో కూడా ఈ
అధియజ్ఞమైన జీవ చైతన్యమే అధ్యాత్మమైన ప్రత్యగాత్మే తానను కొని
అది మరలా ప్రపంచోపాధి అయిన హిరణ్యగర్భ చైతన్యమే నని భావించి
అదే ఆయా ఉపాధుల ద్వారా వివిధ రూపాలుగా ప్రసరిస్తున్న
నిరుపాధికమైన బ్రహ్మ చైతన్యమే చివరకు తన స్వరూపమని గుర్తు
చేసుకోగలిగితే అదే స్మరణ. అది మరణకాలంలో గట్టిగా నిలబడితే
మానవుడి కది మరణం కాదు. ప్రయాణం. తెలివి తప్పితే మరణం. తెలివి
తప్పకుంటే ప్రయాణం.
ఈ తెలివికే బ్రహ్మజ్ఞానమని పేరు. బ్రహ్మం దగ్గరి నుంచి చివరి సారిగా చెప్పిన స్మరణ వరకు అంతా బ్రహ్మమే. అదే అధ్యాత్మమైన
Page 110