దాటిపోతే అది శుద్ధ చైతన్య రూపమైన బ్రహ్మ మొక్కటే. త్రిగుణాత్మిక అయిన మాయా గాదు. గుణాత్మకమైన ఓంకారమూ గాదు. పోతే స్వభావః అధ్యాత్మ ముచ్యతే. తస్యైవ పరస్య బ్రహ్మణః ప్రతిదేహం ప్రత్యగాత్మ భావః స్వభావః అంటున్నారు భాష్యకారులు. అధ్యాత్మమనే మాటకు ప్రత్యగాత్మ The witnessing self in the individual అని అర్ధమట. విసర్గః కర్మ సంజ్ఞితః సమస్త భూత పదార్ధాల జన్మకూ హేతువైన విసర్గమేదో దానికి కర్మ అని పేరు. దేవతల నుద్దేశించి చరు పురోడాశాదులను హోమం చేయటమే విసర్గమంటారు భగవత్పాదులు. దానివల్ల పర్జన్యం - దానివల్ల వర్షం. దానివల్ల ధాన్యం తన్నిమిత్తంగా ఆహారం - వీర్యం - తద్ద్వారా పిండోత్పత్తి. ఆ తరువాత స్థావర జంగమ సృష్టి జరుగుతుంది కాబట్టి ఇదంతా కర్మ. దీనికి మూలమా హవన రూపమైన విసర్గే నంటారు గురువుగారు.
పోతే ఇక అధిభూత మేమిటి. క్షరోభావః - యత్కించి జ్జని మ ద్వస్తు - జన్మించే ప్రతి జీవీ క్షరమే. ఎప్పటికప్పుడు పుట్టి పోయేదే. పురుషశ్చాధి దైవతం. మరి అధిదైవ మేమిటి. పురుషుడు. ఎవడీ పురుషుడు. ఆదిత్యాంతర్గతః హిరణ్యగర్భః - సూర్యమండల మనే ఉపాధి ద్వారా అభివ్యక్త Manifest మయ్యే సమష్టి చైతన్యాంశ ఏదుందో అది. హిరణ్యగర్భుడని పేరు దానికి. హిరణ్యమంటే బంగారంలాంటి చైతన్యజ్యోతి. అది లోపల ఉన్నవాడు గనుక హిరణ్యగర్భు డయ్యాడు. పురుషుడు గూడావాడే. పూర్ణ మనేన సర్వమితి అని అర్ధం వ్రాస్తున్నారు గురువుగారు. సమస్త విశ్వాన్నీ పూరించాడు గాబట్టి పురుషుడట. కార్య బ్రహ్మమని గూడా పేరా
Page 108