#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

  పైగా ఈ ప్రశ్న లర్జును డడగ నివ్వండి. లేదా అర్జునుడి నేపధ్యంలో మనమే అడిగా మనుకోండి. ఈ ఏడింటితో మనకున్న అన్ని సందేహాలూ కవరయి పోతాయి. అంతేగాదు. ఏడింటికీ ఏడు సమాధానాలను కొన్నామా అది ద్వైతం. సమస్య ఇంకా తీరిపోనట్టే. లేక ఏడూ విడిగా ఇచ్చినట్టు కనిపించినా విమర్శించి చూస్తే అన్నిటికీ కలిసి ఒక్కటే సమాధానమని పించిందా అది అద్వైతం. అన్ని సమస్యలూ దానితో సమసి పోవలసిందే. అది ఏమిటో మహర్షి దానినెలా పరిష్కరిస్తాడో వేచి చూద్దాం.

అక్షరం బ్రహ్మపరమం స్వభావో 2 ధ్యాత్మ ముచ్యతే
భూతభావోద్భవకరో - విసర్గః కర్మ సంజ్ఞితః - 3

అధిభూతం క్షరో భావః పురుష శ్చాధి దైవతం
అధి యజ్ఞో 2 హమేవాత్ర - దేహే దేహ భృతాం వర - 4

అంతకా లేచ మామేవ - స్మరన్ ముక్త్వా కళేవరం
యః ప్రయాతి సమద్భావం- యాతి నాస్త్యత్ర సంశయః -5


  ఇప్పుడీ మూడు శ్లోకాల్లో ఆ ఏడింటికీ సమాధానాలు వచ్చాయి. ఒక్కొక్క ప్రశ్నకూ భగవానుడు తొందర పడకుండా వరుసగా ఇస్తున్నాడు. సమాధానం. చూడండి. అక్షరం బ్రహ్మ పరమం. పరమమైన అక్షరమే బ్రహ్మమంటే. పరమ మనటం వల్ల ఇది ఓంకారం కాదు. మాయా శక్తి కాదు. అక్షరమనే మాట వాటికీ వర్తించినా పరమం కావవి. అన్నిటికన్నా అతీతమైన దేదో అది పరమం. అతీత మెప్పు డవుతుంది. త్రిగుణాలను

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు