ప్రసాదిస్తే - రెండవది ధ్యానం కాబట్టి క్రమముక్తి నిస్తుందని సంప్రదాయం. క్రమ మన్నప్పుడు కొంతకాలం సగుణంగా పరమాత్మను ధ్యానించినా అది మరలా నిర్గుణంగా తన కనన్యంగా భావించే జ్ఞానానికే దారి తీయాలి. అప్పుడే ఈ ధ్యాతకు మోక్షం. ఈ సత్యాన్ని ఎప్పుడూ మరచి పోరాదు మానవుడు. ఈ తేడా ఈ అధ్యాయ మధ్యంలో స్పష్టంగా బయటపెడతారు భగవత్పాదులు తమ భాష్యంలో. అక్కడ మరలా చెప్పుకోవచ్చు మనం. అథ ప్రకృత మనుసరామః
కింతద్భహ్మ కిమధ్యాత్మం - కిం కర్మ పురుషోత్తమ
అధిభూతం చ కిం ప్రోక్త - మధి దైవం కిముచ్యతే - 1
అధియజ్ఞః కథం కోత్ర - దేహే స్మిన్ మధుసూదన
ప్రయాణ కాలేచ కధం జ్ఞేయోసి నియతాత్మభిః - 2
రెండు శ్లోకాలలో గుక్క తిప్పుకోకుండా ప్రశ్నిస్తున్నా డర్జునుడు కృష్ణ పరమాత్మను. అదీ ఒకటి గాదు. ప్రశ్న తరువాత ప్రశ్న. ఏడు ప్రశ్నలు. ఇన్ని ప్రశ్నలొక్కసారిగా అర్జునుడు వేయటాని కవకాశ మిచ్చింది పరమాత్మ మాటలే. భగవతా ప్రశ్న బీజాన్యు పదిష్టాని అని బయటపెట్టారు భగవత్పాదులే. ఏమిటా మాటలు. తే బ్రహ్మ త ద్విదుః - బ్రహ్మమనే మాట ఒకటి. అధ్యాత్మం కర్మచాఖిలం - అధ్యాత్మ కర్మ అనేవి రెండూ. వెరసి మూడు. పోతే సాధి భూతాధి దైవమనే చివరి శ్లోకంలో దొర్లిన అధిభూత - అధి దైవ - అధియజ్ఞ - ప్రయాణ కాలమనే నాలుగు.
Page 105