అక్షర పరబ్రహ్మ యోగము
అతీతంగా ఉన్నదని అర్ధం. దేని కతీత మది. దానికి భిన్నంగా ఏదీ లేదని గదా చెప్పారు. నిజమే. అయినా ఉన్నదొకటి. ఆయన మాయాశక్తి. అదీ అక్షరమే. ప్రకృతిం పురుషం చాపి విద్యనాదీ ఉభావపి అని క్షేత్రజ్ఞా ధ్యాయంలో రాబోతుంది. బ్రహ్మంలాగా ఆయన శక్తి కూడా నిత్య సిద్ధమే. కనుక రెండూ అక్షరాలే. అక్షరాలు రెండెలా ఉంటాయని సందేహించ నక్కర లేదు. రెండూ నిరాకార మవినాభూతం కాబట్టి రెండని నిర్దేశించినా అది ఒకే ఒక తత్త్వం.
అయితే వచ్చిన ఇబ్బంది ఏమంటే ఆ బ్రహ్మానికి దానివల్ల బాధ లేదు గాని అవిద్య మూలంగా బ్రహ్మం నేను కాదేమోనని భావించే జీవుడికి మాత్రమది అవరోధకమే ఆ మాయ. ఆయనకు విద్యారూపిణి అయితే వీడి కవిద్యారూపిణి అని ఇంతకు ముందే మనవి చేశాను. అంచేత వీడా అవిద్యారూపిణి అయిన అక్షరాన్ని దాటి పోవాలి. అంతవరకూ దాన్ని పరంగానే భావిస్తుంటాడు. కాబట్టి అక్షర పరబ్రహ్మ మయిందది.
మంచిదే. దాటాలన్నారు బాగానే ఉంది. దాటటాని కేమిటి మార్గం. అది కూడా మరలా అక్షరమే. అక్షరానికి సంబంధించిన జ్ఞానమైనా కావచ్చు. ఆ జ్ఞానానికి వెంటనే నోచుకోకపోతే దానికి ముందు భూమిక Stage అయిన ధ్యానమైనా కావచ్చు. అక్షరమంటే క్షరం కానిది. బ్రహ్మ జ్ఞానమూ అక్షరమే. దాన్ని పట్టుకొనే వరకూ క్షరం గాని ప్రణవ ధ్యానమూ అక్షరమే. అంటే ఓంకారమే అక్షరం. ఇందులో మొదటిది జ్ఞానం కాబట్టి సద్యోముక్తిని
Page 104