8. అక్షర పరబ్రహ్మ యోగము
జ్ఞాన విజ్ఞాన యోగం సమాప్తమయి మనమిప్పుడు ఎనిమిదవ దైన అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రవేశిస్తున్నాము. అక్షర పర బ్రహ్మ అని మూడు మాటలున్నా యిందులో. వీటిలో బ్రహ్మమనే మాట గడచిన అధ్యాయం చివరలోనే వచ్చింది. తే బ్రహ్మ త ద్విదుః అని. బ్రహ్మమంటే ఏమిటో కూడా వివరించాడు. కృత్స్నమని. సమస్తమూ బ్రహ్మమే. జీవ జగదీశ్వర తత్త్వాలు విడిగా లేవు. అదంతా బ్రహ్మమే. అప్పటికి బ్రహ్మం తప్ప మరేదీ లేదు. మరి ఈ అక్షర మేమిటి. క్షరం కానిదేదో అది అక్షరం. మారకుండా నశించకుండా ఎప్పటికీ ఉండేదని అర్థం. అలాంటి దేదోగాదు బ్రహ్మమే. అక్షరం బ్రహ్మ పరమ మని ఇక కొంచెం సేపట్లోనే బయట పెడుతుందీ అధ్యాయం. పోతే ఇక పర మేమిటని ప్రశ్న. పరమంటే
Page 103