అప్పటికీ జ్ఞాన విజ్ఞాన యోగమనే అధ్యాయం మొదట ఏ సర్వాత్మ భావం ప్రతిపాదించిందో అదే ఇప్పుడుప సంహరించి చూపుతున్నది. జ్ఞానం విజ్ఞాన సహిత మని గదా మొదట చెప్పిన మాట. దాని కనుగుణంగా పరమాత్మ స్వరూపాన్నే గాక ఆయన విభాతిని కూడా వర్ణించింది గదా భూమి రాపోనలో వాయుః అని. అంటే ఏమన్నమాట. కేవల మాత్మే గాక అనాత్మ ప్రపంచాన్ని కూడా కలుపుకొన్న ఆత్మే అసలైన ఆత్మ అని చెప్పినట్టయింది. దీనికే సర్వాత్మ భావ మని పేరు. అదే ఇప్పుడీ చివరి చివరి మాటల్లో మనకు నిదర్శన మవుతున్నది మరలా. బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చా ఖిలం. ఇలాటి మాటల వల్ల అఖండమైన అద్వితీయమైన ఆ తత్త్వాన్నే గదా చాటుతున్నది భగవద్గీత. కనుక ఆద్యంతాల కేక వాక్యత కుదిరింది.
ఇతి
జ్ఞాన విజ్ఞాన యోగః సమాప్తః
Page 102