దాని ఫలం. అలా కాక నేను దేహం కాదు కేవల శుద్ధ చిన్మాత్ర స్వరూపుడనైన ఆత్మను గదా అని ఆ పని జరుగుతుంటే సాక్షి మాత్రుడుగా చూస్తుంటాడు గాబట్టి దాని ఫలమతని కంటదట.
అదే ప్రస్తుత మిక్కడ కూడా చెప్పుకోవలసిన సమాధానం. నీవు జీవాత్మ వనుకొంటేనే ఒక క్రియకు కర్తవూ భోక్తవూ అవుతావు. అప్పుడు చంపటం చంపటమే. చావటం చావటమే. అలాకాక నీవే ప్రత్యగాత్మ వనుకొంటే మాత్రమది చంపటమూ కాదు. చావటమంత కన్నా కాదు. రెండూ నీ దృష్టిలో ఒక ఆ భాస. వాస్తవం కాదు. అయితే వాస్తవం కాదు కాబట్టి ఎవరినైనా చంపవచ్చునా అని అడిగితే ఆ స్థాయి కెదిగిన వాడు ఎలాగూ చంపడు. కారణం తాను చంపాలనుకొన్న వాడూ తన స్వరూపమే. ఇక ఎలా చంపగలడు. అలాంటి బుద్ధే పుట్టదు వాడికి. అయితే ఎందుకీ మాట అంటే చెప్పాము గదా సమాధానం ఘాటుగా నీ మనసుకు నాటుకోటానికని చంపటం లాంటి కర్మ కూడా జ్ఞాని దృష్టిలో అకర్మ అయినప్పుడిక కైముతిక న్యాయంగా What to speak of other actions ఇక మిగతా మామూలు కర్మల మాట చెప్పటం దేనికని దీనిలోని ఆంతర్యం.
న జాయతే మ్రియతే వా కదాచి-
-న్నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20 ||
Page 89