#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

కర్తృత్వంగాని దీని ఫలం నేను అనుభవిస్తున్నాననే భోక్తృ భావంగాని ఇలాంటి అభిమానం పనికి రాదని చెప్పటమే ఇక్కడ బోధ. ఈ భావం బాగా మన మనసుకు పట్టటానికే య ఏవం వేత్తి హంతా రం - యశ్చైనం మన్యతే హతం ఎవడు నేను చంపుతున్నానని కర్తగా తన్ను భావిస్తాడో - ఎవడు వాడు చంపితే చస్తున్నానని కర్మగా తన్ను భావిస్తాడో - ఉభౌతౌ నవిజానీతః - వారిద్దరూ మూఢులే. ఆత్మ స్వరూపమేమిటో తెలియనివారే. వాస్తవంలో నాయం హంతి - నహన్యతే. వీడు చంపటమూ లేదు. వాడు చావటమూ లేదని ఘాటుగా చెబుతున్నది గీత. ఇలాంటి సందర్భమే మనకు గీత 18వ అధ్యాయంలో వస్తుంది. యస్య నా హం కృతో భావః - ఋద్ధిర్యస్య నలిప్యతే. ఎవడీ పని నేను చేస్తున్నానే దీనివల్ల నాకు నరకపాతం తప్పదేమో ననే అహంకార మమకారాలు పెట్టుకోకుండా పనిచేస్తాడో హత్వాపిస ఇమాన్ లోకాన్ నహంతి న ని బధ్యతే. వాడెంత మందిని చంపినా చంపనివాడే నట.

  ఏమిటీ విడ్డూరం. చంపినా చంపటం కాదనట మేమిటి. అన్యోన్య విరుద్ధమైన ప్రసంగం కదా అంటే భగవత్పాదులు సమాధానమిచ్చారు. దేహాద్యాత్మ బుద్ధ్యా లౌకికీం దృష్టి మాశ్రిత్య హత్వాపి ఇత్యాహ - పారమార్ధికీ మాశ్రిత్య నహంతి ననిబధ్యతే ఇత్యాహ అని. దేహమేనేననే భావం వదలని వాడు నేనే చేస్తున్నానీ పని అని చేస్తాడు కాబట్టి వాడికంటుతుంది

Page 88

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు