
ప్రపంచం. అందులో అర్జునుడెక్కిన రధం అహంకారాస్పదమైన శరీరం. యుద్ధం వీటితోనే. ఇందులో అహం మమతో పోరాడుతున్నది. మమ పోయి అహం మిగిలినా విషాదమే. మమ చేత అహం దెబ్బతిన్నా విషాదమే. విషాదయోగ సారమంతా ఇదే. పోతే ఈ విషాదమెలా తొలగిపోతుందో ఆ సూత్రం బయటపెడుతున్నది రెండవదైన సాంఖ్యయోగం. అసలీ అహమేమిటో మమ ఏమిటో వివేచన చేసి చూడమంటున్నది సాంఖ్యం. వాటికి దేహి దేహమని పేరు పెట్టింది. దేహి కేవల జ్ఞానమే. ఇక మిగతా మనః ప్రాణేంద్రియ శరీరాది సంఘాత మంతా దేహి కాదు. దేహం క్రిందికి వస్తుంది. అప్పుడు బాహ్యమైన ప్రపంచమెంతో ఈ దేహమనే ఉపాధి అంతే.
దేహేంద్రియాదులైన ఉపాధులే నేను కానని భావించటమే వివేచన. వివేచన చేసేసరికి మనోవృత్తుల దగ్గరి నుంచీ సమస్తమూ నీ జ్ఞానానికి జ్ఞేయంగా భాసిస్తుంది. అది విశేషమూ పరిచ్ఛిన్నమూ కాబట్టి నీ స్వరూపంలాగా అచలం కాదు. చలనాత్మకం. చలనమే కర్మ. ఇది ఎక్కడిది. ఉన్నది అచలమైన నీ జ్ఞానమే గదా. అయినా ఇది కనిపిస్తున్నదంటే అచలమైన నా జ్ఞానమే చలనాత్మకమైన కర్మ జగత్తుగా భాసిస్తున్నదని గ్రహించాలి. జ్ఞానమే ప్రసరిస్తే కర్మ. ఇదే కర్మయోగమనే మూడవ అధ్యాయం. అప్పటికి కర్మగా ప్రసరించినా అది జ్ఞానమే అలా
Page 554
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు