ఉపసంహారము (ప్రధమ)
భగవద్గీత
ప్రసరించిందని ఎప్పుడర్ధమయిందో - కర్మగా కనపడేది ఏదో గాదు జ్ఞానమేనని చాటుతున్నది జ్ఞానయోగమనే నాలుగవ అధ్యాయం. అలాంటప్పుడిక కర్మ జ్ఞానమనే తేడా ఎందుకు చెప్పటం కర్మను జ్ఞానంలో కలుపుకొని అంతా అఖండమైన జ్ఞానంగా భావిస్తే సరిపోలేదా అని మరలా మనకు ఏకైకమైన సత్యాన్ని వర్ణించి చెబుతుంది అయిదవదైన కర్మ సన్న్యాసయోగం.
ఇక్కడికి అహం మమలు పూర్తిగా శుద్ధి అయినాయి. అహం అని శరీరాదులను చూచి గదా అనుకొన్నావు. అవి ఇప్పుడాత్మ స్వరూపమే. మమ అనేది బాహ్యమైన చరా చర పదార్ధాలను చూచి గదా భ్రమపడ్డావు. అదీ ఇప్పుడు నీ స్వరూపమే. అంతటా నీ స్వరూపమే నీ జ్ఞానమే. జ్ఞేయం లేదు. అహమొక జ్ఞేయం. మమ ఒకజ్ఞేయ మింతకు ముందు. నీ స్వరూపానికి విజాతీయంగా కనిపించాయి. ఇప్పుడవి రెండూ నీ జ్ఞానానికి సజాతీయం. ఇక విషాద మేముంది. విశేష దృష్టే విషాదానికి మూలం. విశేష దృశ్యమూ లేదు విశేష దృష్టి లేదిప్పుడు. రెండూ పరస్పర సాపేక్షం Relative. నిరపేక్షమైన Absolute జ్ఞానంలో కరిగిపోయాయి.
పోతే ఇక జీవ భావం పూర్తిగా శుద్ధి అయిపోయింది. సిద్ధాంతమేగాని ఇంకా అది నీకు దృష్టాంతం కాకపోవచ్చు. అలా కావాలంటే తొందర పడకుండా పునాదుల దగ్గరి నుంచీ గట్టి చేసుకొంటూ రావాలి. అదే
Page 555