#


Index

ఉపసంహారము (ప్రధమ) భగవద్గీత

ఆత్మ సంయమ యోగమనే ఆరవ అధ్యాయం మనకు బోధించే విధానం. ఆహార విహారాల దగ్గరి నుంచీ ఆసనాదుల దగ్గరినుంచీ ఇంద్రియ మనో నిగ్రహం దగ్గరి నుంచీ సాధకు డవలంబించ వలసిన నియమ నిష్ఠలను సాంగో పాంగంగా వర్ణించట మిందు కోసమే. అది కూడా ఈ జన్మలోనే ఫలిస్తుందో లేదో నని మనం బేజారయి పోకుండా ఒక పెద్ద హామీ కూడా ఇచ్చింది అధ్యాయం. ఈ జన్మలోనే ఫలించవచ్చు. లేదా శోధన పూర్తికాక పోతే రాబోయే జన్మలోనైనా ఇది నీకు కలిసి వచ్చి అక్కడి నుంచి మరలా నీవు శోధన పూర్తి చేసుకొని ఈశ్వర సాయుజ్య మందుకోటానికి సంసిద్ధుడవు కాగలవని అది ఇచ్చే హామీ. ఇలా ఆత్మానాత్మ వివేకము - కర్మయోగమూ - సత్త్వశుద్ధీ - జ్ఞానప్రాప్తి - కర్మ సన్న్యాసమూ - జ్ఞాన నిష్టా ఈ షట్సాత్ర ప్రణాళిక ద్వారా జీవుడిలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి అంచెల వారిగా వీణ్ణి ఈశ్వరుడి స్థాయికి పట్టుకురావటమే గీతలో ఇంతవరకూ మనం చెప్పుకొన్న ఈ ప్రధమ షట్క సారాంశం.

END

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు