#


Index

సాంఖ్య యోగము

పట్టటం లేదే అని మధన పడుతున్నావు. నామాట వినేట్టయితే అసలు నీకు మరణం లేదు. మరణం లేదంటే జననం కూడా లేదు. అలాంటి భాగ్యం పరమాత్మనైన నాకేగాని మీబోటి జీవులకు లేదను కొంటావేమో. నత్వేవా హం జాతు నాసం - నేనూ ఇంతకు పూర్వం లేకపోలేదు. నత్వం. నీవూ లేకపోలేదు. నేమే జనాధిపాః ఈ భీష్మద్రోణాదులూ లేకపోలేదు. అంతేగాదు. న చైవ న భవిష్యామః - ఇక మీదట కూడా లేకపోము. ఎవరు. సర్వేవయమ్ - మన మందరమూ.

  అందరినీ కలుపుకొని మాటాడుతున్నాడు పరమాత్మ. నేనూ నీవూ వీరూ అని ఉత్తమ మధ్యమ ప్రధమ పురుషలుగా చెప్పుకొనే మానవులంతా. మానవులే గాదు నేనూ అని పరమాత్మ అంటున్నాడు కాబట్టి జీవేశ్వరులనే తేడా లేకుండా మాటాడుతున్నాడు. ఏమని. మొదటి నుంచీ ఉన్నారందరూ ఇకమీదట ఉండబోతారు. మొదటి నుంచీ అంటే జన్మలేదని ఇకమీద కూడా ఉంటాము కాబట్టి మరణం లేదని - జనన మరణా లెగిరిపోయాయి. అవి తనకే గాక మనబోటి జీవులకూ లేవని హామీ ఇస్తున్నాడు. మానవ జీవితానికి జనన మరణాలే రెండు కొసలు. కొసలు రెండూ లేవనే సరికి మధ్యమే అవిచ్ఛిన్నంగా సాగిపోతుంది. అంటే స్థితే ఉంది మనకు గతి లేదు. దీనికే బ్రాహ్మీ స్థితి అని పేరు పెట్టింది గీత. అప్పటికి పుట్టుకా లేదు. గిట్టుకా లేదు. ఒకప్పుడు రాలేదు మనం. ఒకప్పుడు పోలేదు. ఎప్పుడూ ఉంటూనే ఉన్నాము.

Page 54

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు