#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  ఉన్నామంటే ఎలా ఉంటాం. శరీరం గానా మనస్సు గానా ప్రాణం గానా. ఏదీ గాదు. శరీర మనః ప్రాణాలుగా అయితే వాటితో తాదాత్మ్యం Identity చెందిన నేరాని కవిపోతే మనమూ పోక తప్పదు. మరి ఎలాగ ఆత్మగా. అంటే వాటి రాకపోకలు కనిపెట్టే శుద్ధ చైతన్య స్వరూపంగా. అది క్రొత్తగా తెచ్చి పెట్టుకొనేది గాదు. ఇప్పుడూ ఉందని చెప్పాము. అదే ప్రత్యగాత్మ. మనసులో కలిగే ఆలోచనల దగ్గర నుంచీ సుఖదుఃఖాదుల దగ్గరి నుంచీ ప్రాణ స్పందన దగ్గరి నుంచీ చక్షురాదులైన ఇంద్రియ వ్యాపారాల దగ్గరి నుంచీ చివరకు వీటన్నిటినీ అనుక్షణమూ మోస్తున్న ఈ శరీరం దాకా అన్నింటి మంచి చెడ్డలను నిత్యమూ గమనిస్తూ-తాను కదలకుండా కదిలే వాటన్నిటినీ సాక్షిగా చూస్తున్న జ్ఞానమే నా స్వరూపం. అలా చూడాలంటే అది వాటి కంటే విలక్షణంగా వెనకాల ఉండి చూడాలి కాబట్టి దాన్ని ప్రత్యక్కన్నారు. అది మన స్వరూపమే కాబట్టి ఆత్మ Self అన్నారు. వెరసి ప్రత్యగాత్మ అయింది.

  ప్రత్యగాత్మ ఎప్పుడయిందో అది ఇక ఈ శరీరాద్యు పాధులతో సంబంధం లేదు కాబట్టి నిరాకార మవుతుంది. నిరాకారమైతే వ్యాపకమూ నిశ్చలమూ కాక తప్పదు. పోతే వ్యాపకమైన చైతన్యాలు రెండుండటానికి వీలు లేదు. దేహాది సంఘాతం మేరకే పరిమితమైతే వేరవుతాయి గాని పరిపూర్ణంగా వ్యాపిస్తే ఎలా వేరవుతాయి. కాబట్టి ప్రత్యగాత్మే పరమాత్మ. రెంటికీ తేడా లేదు. అదే చెబుతున్నా డిప్పుడు పరమాత్మే స్వయంగా. బాబూ శుద్ధ చైతన్యమే నీ అసలైన ఆత్మ గనుక మన మందరమూ

Page 55

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు