#


Index

ఆత్మసంయమ యోగము

ప్రియతే హ్యపశోపి. పూర్వ పూర్వ జన్మలలో చేసుకొన్న అభ్యాసం వృధా పోదు. ఎప్పటికప్పుడు దాని సంస్కారం Impression పోగవుతూనే ఉంటుంది. అదేవాణ్ణి బలవంతంగా మోసుకొని తెచ్చి ఈ జన్మలో పడేస్తుంది. అవశోపి. వాడి వశంలో లేదది. మరణ సమయంలో బుద్ధి పనిచేయక తెలివి తప్పి పడిపోయాడు వాడు. అలాంటి వాడికే జన్మ ఎత్తితే బాగుండునో - ఎత్తి ఎలా ప్రయత్నం సాగించాలో ఏమి తెలుసు. అన్నీ తెలిసింది ఆ వాసనా శరీరమే. అది వీడు పరవశంగా పడి ఉంటే ఆ శరీరం తప్పించి మరొక శరీరం సృష్టించి అందులో తెచ్చి ప్రవేశపెడుతుంది.

  అలా ప్రవేశ పెట్టినప్పటి నుంచీ జిజ్ఞాసువయి పోతాడు వాడు. తత్త్వమేమిటా అది ఎలా ఉంటుందా అని దాన్ని అన్వేషించే దృష్టి బలంగా ఏర్పడుతుంది వాడికి. దానితో శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్ద బ్రహ్మాన్ని గూడా దాటి పోగలడు. శబ్ద బ్రహ్మమేమిటి. ఏమిటో చెబుతున్నాడు వినండి భగవత్పాదులు. వేదోక్త కర్మానుష్ఠాన ఫల మతివర్తతే. వేదోక్తమైన సత్కర్మ లాచరిస్తే కలిగే గొప్ప ఫలమేదైతే ఉందో అది శబ్ద బ్రహ్మం. స్వర్గాది భోగాలు. అది కూడా దాటిపోతాడంటే ఏమిటర్ధం. అమృతం త్రాగిన వాడికి సోడా కొట్టి ఇచ్చాడన్నట్టుంది. యోగ మార్గంలో ఉన్న జిజ్ఞాసువుకు స్వర్గాదులు దేనికి. అంతకంటే అతీతమైన అపవర్గమే కోరి చేస్తున్నాడు వాడు సాధన. జిజ్ఞాసువుకే అక్కర లేదన్నప్పుడిక అందులో కృతార్థుడైన

Page 539

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు