#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

జ్ఞానికా. వాడసలే దాని ముఖం చూడడు. అందుకే ఆత్మజ్ఞానికి స్వర్గం కూడా నరకంతో సమానమే. రెండూ అంధకార బంధురమేనని చాటి చెప్పారు భగవత్పాదులు ఈశావాస్య భాష్యంలో.

  పోతే ఇప్పుడొక ప్రశ్న వస్తున్నది. పూర్వాభ్యాస మంటున్నారు వ్యాసభగవానులు. పూర్వ జన్మలలో చేసిన అభ్యాసం యోగాభ్యాసమేనని ఎలా చెప్పగలం. మిగతా కర్మలు కూడా ఆచరించి ఉండవచ్చు గదా సాధకుడు. వాటికి ఫలితముండదా. అదే గదా ప్రారబ్ధరూపంగా వర్తమాన జన్మలో బయట పడుతుందని ఇంతకు ముందు వాక్రుచ్చారు. అలాంటప్పుడు జన్మాంతర సంస్కారమనేది రెండు విధాలని ఒప్పుకోవలసి ఉంటుంది. ఒకటి ప్రారబ్ధ రూపం. మరొకటి ప్రయత్న రూపం. రెండూ ప్రస్తుత జన్మలో ప్రవేశించి నప్పుడు ప్రారబ్ధం యోగాభ్యాస ప్రయత్నాని కడ్డు తగలదా. తగిలితే మరలా సాధకుడితోధికంగా ఎలా కృషి చేయగలడు. ఇదే ప్రశ్న వచ్చింది భగవత్పాదులకు కూడా. దానికాయన ఎలా సమాధాన మిచ్చాడో చూద్దాం. న కృతం చేత్ యోగాభ్యాస జాత్ సంస్కారాత్ బలవత్తర మ ధర్మాది లక్షణం కర్మ- తదా యోగాభ్యాస జనితేన సంస్కారేణ ప్రియతే యోగాభ్యాస సంస్కారం కన్నా బలవతర్తమైన అధర్మాది సంస్కారం లేకపోతే అప్పుడా యోగ సంస్కారమే వర్తమాన జన్మలో నిరాఘాటంగా పనిచేస్తుంది. అధర్మ శ్చేత్ బలవత్తరః కృతః తేన యోగ జోపి సంస్కారః అభిభూయత ఏవ అలా కాక అధర్మ సంస్కారమే బలీయంగా ఏర్పడి

Page 540

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు