ఆత్మసంయమ యోగము
భగవద్గీత
ఆవరించిన ఈ గజ శరీరమనే ఉపాధిలో నుంచి నాకు కావాలి మోక్షమంటాడు.
ఏమిటర్ధం. గజమంటే అహంకారానికి సంకేతం. మకరమంటే మమకారానికి చిహ్నం. అహంకారమే జీవభావం. మమకారమే జగద్భావం. ముందు జీవభావం పోతేగాని జగద్భావం అంటే సంసారం తొలగిపోదు. ఇది ఇలాగే ఉంచుకొని సంసారం లేకుండా పోవాలంటే చస్తే పోదు. నీ అనంతమైన స్వరూపాన్ని శరీరం మేరకు పరిమితం చేసింది అహంకారం గదా. తన్నిమిత్తంగానే గదా నీకు విలక్షణంగా ఒక సంసారమంటూ ఏర్పడింది. ఏర్పడితే గదా దాన్ని మమ అని చూస్తున్నావు. కాబట్టి గజభావమే జీవభావం. గజేంద్ర మోక్షమంటే అహంతా రూపమైన భావం పోగొట్టుకోటం. అది పోవాలంటే పూర్వ జన్మల తాలూకు సంస్కారమెంతో పోగుచేసుకొని ఉండాలి. అది మనకు చాటి చెప్పటమే వేదవ్యాసుని వివక్షిత మింతకూ.
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే || 44 ||
భగవద్గీతా వ్యాసుడే గదా భాగవత వ్యాసుడు. భగవద్గీతలో చెప్పిన మాటే భాగవతంలో కధాముఖంగా నిరూపిస్తాడు. అక్కడ నిరూపించిన విషయాని కనురూపంగానే మరలా ఇక్కడికి వచ్చి మాటాడుతాడు. అలాటి మాటే ఇప్పుడు మరలా మాటాడుతున్నాడు. ఏమని. పూర్వాభ్యాసేన తేనైవ
Page 538