ఆత్మసంయమ యోగము
భగవద్గీత
సాగిస్తే ఈ జన్మలోనే ముక్తుడయి పోవచ్చు. లేదా ఇంక ఒకటి రెండు జన్మలలో కావచ్చు. మొత్తం మీద కృషితో నాస్తి దుర్భిక్ష మన్నట్టు సిద్ధి అవశ్యం భావి.
దీని కుదాహరణ ప్రాయం భాగవతంలో ఇంద్రద్యుమ్న మహారాజు జీవితం. సగుణంగా గడచిందాయన జీవితం మొదట్లో. గొప్ప విష్ణుభక్తు డాయన. సగుణంగా చూచాడు పరమాత్మను. అది చాలదు. నిర్గుణ తత్త్వాని కెదగాలి నీవని బోధించాడు పరమాత్మ ఆయనను అగస్త్య మహర్షి శాపమనే వ్యాజంతో. దాని కనుగుణంగా జన్మ ఎత్తాడు గజేంద్ర రూపంలో. గజేంద్రుడుగా జన్మించినా అది కేవలమొక ఉపాధి మాత్రమే. లోపల భక్తి వాసన బ్రహ్మాండంగా గుప్తమయి ఉంది. అది జ్ఞానవాసనగా మారటానికి కొంతకాలం పట్టింది. మకర గ్రహణంతో అది కాలం కలిసి వచ్చి బయట పడ్డది. ఏ రూపంగా. భక్తిరూపంగా కాదు. అనన్య భక్తిరూపంగా. అంటే ఆత్మ జ్ఞానంగా. దానికి ప్రచోదకం పూర్వకృత కర్మ పరిపాకమే. పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తి అదే. అదే క్రమంగా మోక్షమనే సిద్ధికి దారి తీసింది. మోక్షం దేనిలో నుంచి. మకరబంధం నుంచా. కాదు. గజ శరీర బంధం నుంచి. అదే గజేంద్ర మోక్షం. జిజీవిషేనాహ మిహా ముయా కి మంత ర్బహిర్వ్యాప్తృత యేభయోన్యా. ఈ గజ యోనిలో బ్రతకటం నాకిష్టం లేదంటాడు గజేంద్రుడు. మరేదతని కిష్టం. ఇచ్ఛామి కాలేన నయత్ర విప్లవ - స్తస్యాత్మలో కావరణస్య మోక్షణం. నా ఆత్మ చైతన్య ప్రకాశాన్ని
Page 537