అయితే ఇక అంతా ధర్మ విషయమే. ఇది ఎలాంటిదంటే వెలుతురున్నంత వరకూ చీకటి అనే వార్తే లేదు. అది ఎప్పుడు తగ్గిపోయిందో - ఎంతెంత తగ్గుతుంటే అంతంత చీకటి చోటు చేసుకొంటుంది. చీకటనే దొకటి ఉందని గాదు మరలా. వస్తుసిద్ధంగా ఎక్కడా లేదది. లేకున్నా వెలుగు బలహీన పడటమే దానికెక్కడ లేని బలం. అది తాత్కాలికమే కావచ్చు. కాని అంతవరకూ దాన్ని భరించక తప్పదు. అలాగే జ్ఞానమింకా ఉదయించకుండానే పోయాడుగదా సాధకుడు. వాడికి లోకాంతర జన్మాంతర ప్రయాణం తప్పదు. వాస్తవంగా కాకపోయినా వ్యావహారికంగా Hypothetical నైనా ఒప్పుకోక తప్పదు. వాడికే గాక అసలు సాధనే చేయని లోకులకింకా తప్పదీ వ్యవహారం. వాడు జ్ఞానమింకా అందుకో లేదు. వీరికా ప్రయత్నమే లేదు. ఇక చీకటి గాక ప్రకాశమేముంది. జ్ఞానమనే ప్రకాశానికి నోచుకోనంత వరకూ ధర్మమనే చీకటి నీకిష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పదు. తాత్కాలికంగానైనా అనుభవించక తప్పదు. అదే లోకాంతర జన్మాంతర వ్యవహారం. అదే ధర్మ పురుషార్ధం Religious fact. దాన్ని ప్రమాణంగా తీసుకొని జవాబిస్తున్నా డిప్పుడు భగవానుడు.
పార్ధ నైవేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే - నాయనా నిరంతరా భ్యాస శీలుడైన యోగి ఒకవేళ జ్ఞానోదయం కలగక ముందే మరణించినా భయం లేదు. వాడిహంలో నీకు కనపడకుండా పోయినా వినాశం లేదు వాడికి. ఇహంలో కాకుంటే పరంలో బ్రతికి ఉంటాడు. ఇంతకంటే
Page 531