ఆత్మసంయమ యోగము
భగవద్గీత
హీనమైన జన్మ రాదు వాడికి. పరంలో ఉత్తమ సుఖాలను భవించి మరలా వచ్చి జన్మిస్తాడు. ఉత్తమమైన జన్మ ఎత్తుతాడు. ఎందుకంటే నహి కల్యాణ కృత్కశ్చి దుర్గతిం గచ్ఛతి. మంచి పనిచేసిన వాడెప్పుడూ చెడిపోడు. అధోగతి పాలుకాడు. పరమాత్మగా నేనిస్తున్నాను హామీ. జీవాత్మ దశలో బతుకుతున్న మీకు తెలియకపోవచ్చు. అన్నీ తెలిసనవాడను కాబట్టి నేను చెప్పే మాట నమ్మాలి మీరు.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే || 41 ||
ఏమిటా మాట. జీవులకు తెలియని రహస్యమేమని చెబుతున్నాడు. పరమాత్మ. యోగభ్రష్టుడు సర్వనాశనమయి పోడు. అభిజాయతే. మరలా జన్మిస్తాడీ లోకంలో. ఎప్పుడు. దేహపాతమైన వెంటనేనా. కాదు. దానికొక క్రమమున్నది. అది మీకు తెలియదు. నాకు తెలుసు ఆ రహస్యం చెబుతున్నాను విను. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ - చచ్చిన తరువాత యోగ సాధకుడు పుణ్య లోకాలకు వెళ్లిపోతాడు. అశ్వమేధాది యాగాలు చేసి పుణ్యం గడించిన వారి లోకాలకు వెళ్లుతాడని వ్రాస్తారు గురువుగారు. అలా వెళ్లి పోయి ఆ లోకాలలో ఉషిత్వా శాశ్వతీస్సమాః - చాలా సంవత్సరా లక్కడే ఉంటాడు. అవి దివ్య సంవత్సరాలైనా కావచ్చు.
అలా ఉంటూ అక్కడే ఉండిపో రెప్పటికీ. మరలా వచ్చి ఈ కర్మ భూమిలో జన్మిస్తారు యోగభ్రష్టులు. కర్మ భూమిలో అందరూ జన్మిస్తూనే
Page 532