#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఉంటారు గదా. మరి వారి విశిష్టత ఏమిటి. శుచీనాం శ్రీమతాం గేహే. అదీ విశిష్టత. శుచీ శుభ్రతా ఆచారమూ సంస్కారమూ ఉన్నవారి ఇంట్లో జన్మిస్తారు. కేవల మాచార వ్యవహారాలే గాదు. శ్రీమంతులు కూడా అయి ఉండాలి వారు. ఇందులో ఆచారం చిత్తశుద్ధికైతే - సిరిసంపదలు జీవయాత్ర సుఖంగా సాగటానికి. ఒకటి అభ్యంతరం మరొకటి బాహ్యం. సంస్కారం లేనివారికి జన్మిస్తే ఆవాతావరణంలో కృషి చేయలేరు. సంస్కార మున్నా తగినంత ధన సంపత్తి లేనివారైతే కాలమంతా సంపాదనకే ఖర్చయి పోతుంది. ఇక యోగసిద్ధి పొందే అవకాశమేముంది. కనుక సాధనకు ఉండవలసిన రెండు సౌకర్యాలూ సూచన చేశాడీ మాటల్లో భగవానుడు.

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42 ||

  అంతే కాదు. సంస్కారవంతులూ శ్రీమంతుల ఇళ్లలోనే గాక ఇంకా కొందరు మహనీయులు యోగుల కులంలోనే జన్మించినా జన్మించవచ్చు. యోగినా మంటే దరిద్రాణామని అర్ధం వ్రాశారు గురువుగారు. శ్రీమంతులని ఇంతకుముందే పేర్కొన్నారు. కాబట్టి వీరు దానికి భిన్నంగా ధనహీనులయి ఉంటారని ఆయన ఉద్దేశం. అంతేకాదు. ఏతద్ది దుర్లభ తరం లోకే జన్మ యదీ దృశం. ఇలా యోగులూ అకించనులూ అయిన వారి ఇంట్లో జన్మించట మనేది లోకంలో చాలా అరుదైన విషయమంటున్నాడు భగవానుడు. ఎందుకని. సంపన్నులకు జన్మిస్తే సిరిసంపదలన్నీ పిలిస్తే పలుకుతుంటాయి కాబట్టి ఆ మైకంలో పడి వాడికి పారమార్ధికమైన స్మృతి

Page 533

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు