#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

లేకపోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చేయకుండా భోగభాగ్యాలు వాడి దారి కడ్డు తగలవచ్చు. అలాటి ప్రమాదం లేదు దరిద్రులైన వారికి జన్మిస్తే. సాధన మార్గాని కడ్డు పడేదేదీ ఉండదు. అయితే పూటకు గతి లేనివాడు జీవితావసరాలు వెతుక్కోటంలోనే సరిపోతుంది గదా. ఇక సాధన ఎలా చేస్తాడు. అవకాశ మేముంది అని అడగవచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తాడని గాదు సాధన. ఇంతకు ముందు జన్మలో సౌకర్యాలుండి కొంత దూరం సాధనచేసినా వాడే ఇప్పుడిలాటి జన్మ ఎత్తాడు గనుక ఆ అభ్యాస బలమే ప్రేరణ చేస్తుంది వాణ్ణి ఇంకా సాగించమని. అది దీక్షగా చేయాలంటే కలిమి కంటే లేమే వాడికి దోహదం చేస్తుంది. లేమి వైరాగ్య భావాన్ని పెంపొందించి ఇతోధికంగా సాగించే అభ్యాసాన్ని బలపరుస్తుందని భావం. కనుకనే నాకెప్పుడూ సుఖాలుగాక కష్టాలే కలుగజేయి నీ స్మరణ నిరాటంకంగా చేయగలనని కోరుతుంది కుంతీదేవి కృష్ణ పరమాత్మను.

  ఇప్పుడీ రెండు శ్లోకాలలో ఉదాహరించిన సాధకుల జన్మలు రెండూ రెండు శాఖలు. ఒకటి సంపన్నులైన వారికి జన్మించటం. వేరొకటి దరిద్రనారాయణులకు జన్మించటం. ధనమూ దారిద్య్ర్యమూ ఈ రెండింటిలోనే తేడా చెప్పాడు గాని శుచీనా మనే గుణంలో తేడా చూపలేదు. శుచిత్వ మంటే శుద్ధి. అది బహిశ్శుద్ధి అయినా కావచ్చు. అంత శ్శుద్ధి అయినా కావచ్చు. రెండూ శౌచం క్రిందికే వస్తాయి. రెంటినీ ఉద్దేశించింది గీత. అది అవశ్యంగా ఉండాలిద్దరికీ. అది ఉండి ఆపైన ఐశ్వర్య

Page 534

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు