#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

మొకడికుంటే దారిద్య్ర్య మింకొకడి కుండవచ్చు. దారిద్య్రమున్న వాడి జన్మ ఐశ్వర్యంలో తులతూగే వాడి జన్మ కన్నా ఇంకా దుర్లభమని కూడా వీడికి కితాబిస్తున్నది గీత.

  ఇప్పుడీ రెండు భావాలకూ రెండు గొప్ప ఉదాహరణలు మనకు భాగవతంలో దొరుకుతాయి. మొదటిది ప్రహ్లాదుడి జీవితం. రెండవది కుచేలుడి జీవితం. పుట్టుకతోనే అప్లైశ్వర్యాలతో తులతూగుతూ బ్రతికాడు ప్రహ్లాదుడు. వాడికి దారిద్య్రం లేదు లేశమైనా. అయినా గొప్ప జ్ఞాని. ఎక్కడబడితే అక్కడ పరమాత్మనే చూస్తున్న జీవితమది. పోతే కుచేలు డలా కాదు. జన్మతః దరిద్రుడు. కుచేలుడనే మాటే చెబుతుందతని దారిద్య్ర మెలాటిదో. పైగా ప్రహ్లాదుడిలాగా ఒంటి వాడు కాదు. పెండ్లాం బిడ్డలున్న వాడు. ఆ బిడ్డలూ ఒకరిద్దరు గారు. భార్య కడుపు పండినంత మంది. కుచేల సంతానమని గదా వాడుక.

  అయినా ఇద్దరూ ఇద్దరే. మహనీయులు - నిరంతర తత్త్వ చింతన పరాయణులు. అతడు భోగభాగ్యా లున్నాయి నాకేమని పొంగి పోలేదు. ఇతడవి ఏవీ లేవే నాకని కుంగిపోలేదు. జీవితం సాఫీ గానే సాగిపోయిం దిద్దరికీ. జీవితం జీవితంగా భావించ లేదిద్దరూ. పరమాత్మ విభూతిగా దర్శిస్తూ గడిపారు. అంచేత గుణమిద్దరికీ ఉంది. అది సమానం. లోపలా వెలపలా పరమాత్మనే చూస్తున్నా రిరువురూ. అదే శౌచమనే మాట కసలైన అర్ధం.

Page 535

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు