
ఏమిటది ఎలా సాగించాలో ఆ ప్రయత్నమింతకు ముందు నుంచీ చెబుతున్నా డిప్పుడూ చెబుతున్నాడు. సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్త్వా సర్వాన శేషతః - ఇది మొదట నీవు చేయవలసిన ప్రయత్నం. మనసుతోనే గదా ఎప్పటికైనా అందుకో వలసిందా భూమిక Stage. అది సరిగా లేకపోతే ఎలా. ఎలా ఉండాలది. పరిశుద్ధంగా ఉండాలి. కోరికలు గొడవ చేస్తున్నంత వరకూ స్తిమితంగా ఉండదది. నిర్మలంగా ఉండదు. కోరికలకు మూలమేమిటి. సంకల్పం. సంకల్పం వల్లనే ప్రభవిస్తాయి కోరికలన్నీ. అవన్నీ యోగ సాధకుడు నిశ్శేషంగా త్రోసి పారేయాలి. ఏ వస్తువు మీదా దృష్టి పెట్టరాదు. ఏదీ కావాలని కాంక్షించరాదు. ఏమున్నా లేకున్నా ఒకటేనని చూడాలి. దైవికంగా దాని పాటికది ఏది లభిస్తే అదే అనుభవిస్తూ పోవాలి. అదీ త్యాగమనే మాట కర్ధం. అదే పనిగా వదిలేయటం కాదు. అదే కావాలని కోరటమూ కాదు. అలాగైతేనే మనసు నీకు వశమవుతుంది. లేకుంటే దానికి నీవు వశమై పోతావు.
మనసు స్వాధీనమైతే చాలు. మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః - ఇంద్రియాలు వాటి పాటి కవే అధీనమవుతాయి. మనసును బట్టి ఇంద్రియాలు. ఇంద్రియాలను బట్టి మనసు గాదు. మనసు పగ్గం ఇంద్రియా లశ్వాలని గదా కఠోపనిషత్తు మాట. కాబట్టి మనసుతోనే అరికట్ట వచ్చు ఇంద్రియ వర్గాన్ని. ఎక్కడ ఉందని అది. మన శరీరంలో ఉన్నాయని పేరు ఇంద్రియాలు. కాని పట్ట పగ్గాలు లేకుండా తిరుగుతుంటాయి విషయ జగత్తులో. అంచేత సమంతతః ఎటూ పోనీయకుండా మనసుతో వాటిని
Page 499
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు