#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

అన్ని వైపుల నుంచీ వెనక్కు మళ్లించాలి. మనస్సునంతకు ముందే నిస్సంకల్పంగా మార్చుకొని కూచోవాలి. ఈ విధంగా అంతరింద్రియ బహిరింద్రియాలు రెండూ పరిశుద్ధమైతే వాటిని మెల్ల మెల్లగా బుద్ధ్యా ధృతి గృహీత యా బుద్ధి బలంతో గట్టిగా పట్టుకొని వాటి వాటి పనుల నుంచి వాటిని విరమింప జేయాలి. ధృతి గృహీతయా. దానికెంతో ధైర్యముండాలి నీ బుద్ధికి. వికల్పాత్మక మైనది మనస్సయితే నిర్వికల్పమైనది బుద్ధి. అది మనస్సును కంట్రోలు చేస్తే మనసు చక్షురాదులైన ఇంద్రియాలను నిలదీస్తుంది.

  అన్నీ నీ చెప్పుచేతల్లో ఉంటే ఇంకేమి. ఆత్మ సంస్థం మనః కృత్వా. నీమనస్సును నీ ఆత్మలోనే నిలిపి నకించి దపి చింతయేత్. మరేదీ ఇక ఆలోచించ గూడదు నీవు. మనస్సు నాత్మలో ఉంచటమేమిటి. ఆత్మ అంటే ప్రత్యగాత్మ. నీ అసలైన నేను. నీ స్వరూపమే అది. అందులో సంకల్పం కామ మనే వృత్తు లేర్పడితే చాలు. అదే మనసనే పేరుతో బయటికి వస్తుంది. వృత్తి రహితమైతే అదే మరలా ఆత్మగా మారుతుంది. రాక పోకలు మనసుకే ఆత్మకు గావు. రాకపోకలు కూడా వాస్తవం గావు. ఆ భాస. ఆత్మే అప్పటికి మనసుగా భాసిస్తున్నదన్న మాట. ఆత్మ అని గుర్తించక పోతే మనసు. గుర్తిస్తే మనసు గాదది. ఆత్మ. అదే ఆత్మ సంస్థం మనః కృత్వా అని చమత్కారంగా చెబుతున్నది గీత. అంతేగాదు. నకించిదపి చింతయే త్తనటంలో మళ్లీ ఆత్మ మనసుగా మారి పోకుండా జాగ్రత్త పడమని కూడా హెచ్చరిస్తున్నది సాధకుణ్ణి.

Page 500

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు