లేదు. గతిలో లేదది. స్థితిలో ఉంది. అది మామూలుగా అందకపోతే ప్రయత్న పూర్వకంగా సాధించాలి. అందుకే చిత్తాన్ని నియమించుకో మంటున్నాడు. పరి పరి విధాల పరుగెత్తకుండా ఏకాగ్రం చేసుకోవాలి.
అలా ఏకాగ్రం కావాలంటే ఎలా కావాలి. ఏకైకమైన వస్తువును చూపాలి దానికి. ప్రాపంచికమైన పదార్థాలన్నీ ఏకం కావు. అనేకం. అసంఖ్యాకం. ఒకదాన్ని చూచిన కంట మరొక దాన్ని చూడలేము. అలాంటప్పుడు వాటిమీదికి మనసు పోతే అది ఏకాగ్రమెలా అవుతుంది. ఏకాగ్రం వాటన్నిటినీ గమనిస్తున్న ఆత్మ చైతన్యమొక్కటే. అది ఈ అనేక విధాలైన చరా చర పదార్ధాలన్నిటినీ లోపలా బయటా వ్యాపించి ఉంది. కనుక అలాటి ఆత్మలోనే మనసు నిలపగలిగితే అదే ఏకాగ్రత.
అది కూడా అంత సులభం కాదు. చెప్పినంత సులభంగా నిలపలేడు మానవుడు. అలా నిలపాలంటే అసలు వాడికే పదార్ధాల మీదా కోరిక ఉండకూడదు. నిః స్పృహ స్సర్వకామేభ్యః అది కావాలిది కావాలి - అదీ ఇదీ పోగు చేసుకొందామనే చాపల్యం పనికిరాదు. సర్వకామేభ్యః కామాలంటే కా మించే పదార్ధాలు. దృష్టా దృష్ట విషయాలని వ్రాస్తున్నారు భాష్యకారులు. ఇహానికి సంబంధించినవి దృష్టమైతే పరానికి చెందిన స్వర్గాది భోగాలు అదృష్టం క్రిందికి వస్తాయి. అందులో ఏదైనా కామ్యమే. దేనివెంట బడ్డా మనసు నిలవదు పరుగెడుతుంటుంది. అనవసరమైన కర్మకాండ పెరిగిపోతుంది. అందులో బడిపోతే మనసు అడుసులో బడ్డట్టే - మోక్ష
Page 486