ఆత్మసంయమ యోగము
భగవద్గీత
దుఃఖహా. సర్వ సంసార క్షయకారి అయిన యోగం ఫలిస్తుందని హామీ ఇస్తారు భాష్యకారులు.
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18 ||
యుక్త యుక్త అని విధి విరామం లేకుండా వర్ణిస్తున్నారే ఎప్పుడవుతాడు యుక్తుడీ మానవుడని ప్రశ్న వచ్చింది. చెబుతున్నా డెప్పుడవుతాడో. యదా వినియతం చిత్త మాత్మన్యే వావతిష్ఠతే అని కండిషను. ఎప్పుడీ సాధకుడి మనస్సు బాహ్యమైన విషయాలేవీ ఆలోచించకుండా వాటన్నిటిలో నుంచీ వైదొలగి కేవలం తన స్వరూపంలోనే నిలకడ చెందుతుందో అప్పుడు. అప్పుడే అది అసలైన స్థితి. అది తప్పితే మిగతాదంతా గతే. చిత్తానికి రెండే దశలు. ఒకటి స్థితి Stability. మరొకటి గతి Change or movement ఇందులో నామరూపాలను గూర్చి ఆలోచిస్తున్నంత సేపూ దానికి గతే తప్ప స్థితి లేదు. ఎందుకంటే నామరూపాలనేవి విశేషాలు. ఒక విశేషం లాగా వేరొక విశేషముండదు. క్షణ క్షణమూ మారుతుంటాయి. అవి మానవుడి మనస్సును తమ మీది కాకర్షిస్తుంటాయి. అవి మారుతుంటే వాటి మీద వాలిన మనసు కూడా మారుతూ పోతుంది. అవి అసంఖ్యాకం కాబట్టి ఎక్కడికీ నిలవవు. వాటి ననుసరించి ఈ మనసు కూడా నిలవకుండా పరుగెత్తుతుంటుంది. ఇదే గతి అంటే. ఇది ఇలా జరుగుతున్నంత వరకూ యుక్త అనే మాట కర్ధం
Page 485