మామూలుగా. కాని భగవత్పాదులు చాలా సూక్ష్మంగా చూచి అర్ధం వ్రాస్తున్నారు. అలాగే ద్వేష్య. మనకు నిష్కారణంగా అనిష్టం చేసే వాడు. ఇక్కడ అరి ద్వేష్య అనే మాటలు సమానార్థ కాలేనా అని తోస్తుంది మనకు. కొంచెం తేడా ఉంది. ఒకడు కేవలం శత్రువు. ఒకడు నీ కిష్టం లేని పని చేస్తుండేవాడు. ఇష్టం లేనిది చేసినప్పుడే వాణ్ణి ద్వేషించ వలసి వస్తుంది. కనుక వాడు శత్రువయ్యాడు. వీడు ద్వేష్యుడయ్యాడు. ఒకడు Enemy ఒకడు Hated. పోతే బంధు - సంబంధి బాంధవులు. రక్త సంబంధ మున్నవారు.
ఇప్పుడీ చెప్పిన వారందరూ మళ్లీ రెండు తెగలు. సాధుష్వపిచ పాపేషు. శాస్త్రీయమైన సన్మార్గంలో నడుచుకొనేవారు సాధువులు. అలాకాక శాస్త్రాన్ని కూడా లెక్క చేయక నిషిద్ధమైన పనులు చేస్తూ అసన్మార్గంలో ప్రవర్తించే వారు అసాధువులు. లేదా పాపాత్ములు. లోకమంతా ఇంతే. అయితే పుణ్యాత్ములైనా అయి ఉంటారు. లేదా పాపాత్ములైనా అయి ఉంటారు సాధారణంగా మానవులు. అంచేత వారితో నిత్యమూ వ్యవహరించే టప్పుడు మనకు కొందరి మీద రాగమూ మరికొందరి మీద ద్వేషమూ ఏర్పడటం సహజం. అలాగే అయితే అది పామరుడి దృష్టి. మరి యోగారూఢుడలా పామరంగా బ్రతికితే ఏమి గొప్ప. వాడెంతో వీడంతే అవుతాడు. కాబట్టి యోగారూఢుడైన జ్ఞాని సమబుద్ధి ర్విశిష్యతే - కః కింకర్మా ఎవడెలాటి మార్గంలో నడుస్తున్నాడని మనసుకు
Page 469