ఆత్మసంయమ యోగము
భగవద్గీత
రానీయకుండా మనసులో అందరూ ఆత్మ స్వరూపులే - పైకి కనిపించే తేడా కేవల మా భాసే అది వ్యవహారం వరకే పరమార్ధం కాదనే సమభావనతో ఉండాలెప్పుడూ. ఇక్కడ విశిష్యతే అనేగాక విముచ్యతే అని ఒక పాఠాంతర Reading ముందని చెబుతారు భాష్యకారులు. విశిష్యతే అంటే లోకులకన్నా వాడు విశిష్టుడని - విముచ్యతే అంటే వాడే ముక్తుడని అర్ధం.
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 10 ||
అంచేత అలాంటి ఉత్తమమైన జ్ఞాన భూమిక నీవందుకోవాలంటే అందుకోవచ్చు. సందేహం లేదు. కాని ఉత్తమాధికారివైతేనే అది సాధ్యం. మధ్యమ మందాధికారుల విషయమలా కాదు. వారింకా సాధకావస్థలో ఉన్నారు. కనుక జ్ఞానమనే గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తదభిముఖంగా ప్రయాణం సాగించాలి వారు. దానికే సాధన అభ్యాసం కృషి అని పేరు. ప్రస్తుత మలాంటి అభ్యాస మెలా చేయాలో వర్ణిస్తున్నాడు భగవానుడు.
యోగీ యుంజీత సతతం. యోగీ అంటే ధ్యాయీ అని అర్థం వ్రాశారు గురువుగారు. ధాన్యం చేస్తూ పోయే సాధకుడు ధ్యాయి. వాడే ఇక్కడ యోగి. యోగాభ్యాసం చేసేవాడని అర్ధం. వాడెప్పుడూ యుంజీత. ఆత్మానం ఆత్మ అంటే అంతః కరణం. మనస్సు. దానినెప్పుడూ సమాధాన పరుచుకొంటూ ఉండాలి. అంటే మనసు నేకాగ్రం చేసుకోవాలని భావం.
Page 470