#


Index

ఆత్మసంయమ యోగము

ఏదైనా అనుభవంతోనే ఆఖరు. లోకంలోనైనా అంతే - అధ్యాత్మ రంగంలోనైనా అంతే.

  పోతే జ్ఞాన విజ్ఞానాలైన తరువాత ఇక మూడవ భూమిక కూటస్థః విజితేంద్రియః - ఒక పర్వత శిఖరంలాగా అప్రకంప్యః భవతి - నిన్ను కదపటానికి లేదెవ్వరూ. నీకు భిన్నంగా ఏదైనా ఒక భావముంటే గదా నిన్ను కదిలించటానికి. అంతా నీ స్వరూపమే. అది ఎలా కలిగింది నీ కాదశ. మనః ప్రాణేంద్రియాలు నీ అధీనంలో ఉన్నాయి. అవి కూడా నీ చైతన్య ప్రకాశం తాలూకు ఛాయలే నీడలే. ఇక నీ కన్యమనే చింత ఏముంది. లేకుంటే నీకు చలనమేముంది. ఏదైనా అనాత్మ పదార్ధమంటూ కనిపిస్తే అది అందుకోవాలనీ అనుభవించాలనీ చాపల్య మేర్పడుతుంది. అప్పుడే నీకు చలనమనేది. అలాటి భావమే లేనప్పుడు చలించేదే ముంది. కూటస్థమే అచలమే. అలాటి కూటస్థ భావ మేర్పడిందంటే వాడు యుక్తుడూ. వాడే యోగి. యుక్త ఇత్యుచ్యతే యోగీ అని హామీ ఇస్తున్నది గీత. యుక్తః అంటే సమాహితః అని అర్ధం చెప్పారు భాష్యకారులు. ధ్యాన సమాధి సిద్ధించినట్టే వాడికి. ధ్యానయుక్తుడు గనుక ధ్యానయోగివాడు. నిత్యమూ సమాధిలోనే కాలం గడుపుతుంటాడు. పరమాత్మ దృష్టితోనే ఉంటాడు. పరమాత్మ దృష్టి వేరు. తన దృష్టి వేరూగాదు. పరమాత్మ దృష్టే తన దృష్టి. పరమాత్మ దృష్టే తన దృష్టి గనుకనే సమలోష్టాశ్మ కాంచనః ఏది చూచినా తేడా లేదు. అంతా సమానమే. లోష్టమైనా ఒకటే అశ్మమైనా

Page 466

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు