
హృదయం. కర్మా జ్ఞానమూ పైకి భిన్నంగా కనిపిస్తున్నా వాస్తవంలో రెండూ ఒకే ఒక తత్త్వమని. అందులో సాంఖ్యమంటే జ్ఞానం. యోగమంటే కర్మ. అలాగే మరొక భాషలో ఇక్కడ సన్న్యాసమంటే జ్ఞానం. యోగమంటే కర్మ జ్ఞానమంటే మరలా ఏదో గాదు. సర్వమూ నా స్వరూపమే ననే ఆత్మ జ్ఞానం. మరి కర్మ అంటే కూడా ఏదో గాదు. ఆ జ్ఞానం తాలూకు ప్రసరణే దాని విభూతే. దాని విస్తారమే. సూర్యమండలం జ్ఞాన మనుకొంటే దానిలో నుంచే బయటికి వచ్చి సర్వత్రా వ్యాపించిన సూర్య ప్రకాశమే కర్మ. రెండూ అవినాభూతంగా ఓతప్రోతంగా కలిసి ఒకే ఒక ఆత్మతత్త్వం. అచలంగా ఉన్న ఆత్మే చలించి అనాత్మగా భాసిస్తున్నది. కనుక అనాత్మ ప్రపంచం కూడా ఆత్మే నిజానికి. అంచేత అనాత్మ అని దాని నన్యంగా చూడక అందులో కూడా ఆత్మనే దర్శిస్తూ పోవాలని అదే అద్వైత ధ్యానమని సాధకులకు బోధించటమే వ్యాసమహర్షి ఆశయం.
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || 3 ||
ఇలాటి మహోన్నతమైన అద్వైత భావం ఒక్కసారిగా అందుకోటం సాధకులకు కష్టమని తెలుసు మహర్షికి. ఎవరో ఉత్తమాధికారికి తప్ప మిగతా మంద మధ్యమాధికారులకు తగినంత శిక్షణా అభ్యాసమూ అవసరమని కూడా తెలుసు నాయనకు. అందుకే ఆయన మొదటనే జ్ఞానమనే మాట బయటపెట్టకుండా యోగమూ కర్మా అని అభ్యాస మార్గ
Page 453
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు