ఆత్మసంయమ యోగము
భగవద్గీత
ముపదేశిస్తున్నాడు మనకు. ఇక్కడ యోగమంటే ధ్యానయోగమని అర్ధం చెబుతారు భగవత్పాదులు. కర్మ అంటే బాహ్యమైన ఇంద్రియ వ్యాపారాలని అర్ధం. ఇందులో ఆరురుక్షు వొకడైతే - ఆరూఢుడొకడు. కొండ శిఖరాన్ని ఎక్కేవా డారురుక్షువు. ఎక్కి అక్కడ కూచున్నవా డారూఢుడు.
ఇక్కడ కొండ శిఖరం లాంటిది ధ్యానయోగం. ఆరూఢుడి స్థానమది. ఆస్థానం వాడు చేరాలంటే అంతకుముందు వాడుదాన్ని చేరే ప్రయత్నం చేస్తూ పోవాలి. అది ఆరురుక్షుడి వ్యవహారం. ఏదో గాదది కర్మయోగం. కర్మయోగం జ్ఞానానికి బహిరంగమైతే సమాధి యోగం దాని కంత రంగమని గదా పూర్వం మనకు సూచన చేశారు గురువుగారు. ఉట్టికెక్కితే తరువాత స్వర్గానికి. ముందు కర్మయోగి ధ్యానయోగాన్ని అందుకొంటే తద్ద్వారా వాడు క్రమంగా జ్ఞానయోగాన్ని పొందగలడు. కనుకనే చెబుతున్నది గీత. ఆరురుక్షోర్మునే ర్యోగం కర్మ కారణం. ధ్యానయోగాన్ని అందుకోవాలని కాంక్షించే మునికి కర్మయోగమే సాధనమట. ముని అని పేర్కొనటంలో ఏమిటర్ధం. ముని అంటే కర్మఫల సన్న్యాసి అని అర్ధం చెప్పారు భాష్యకారులు. కర్మఫలాన్ని సన్న్యసించి కేవలం యోగం కోసమే కర్మ చేస్తూ పోయే కర్మయోగే ముని. అలాటివాడు తప్పకుండా కొంతకాలానికి ధ్యానయోగమనే భూమిక నందుకోగలడు.
అందుకొంటే అంతవరకూ ఆరురుక్షువైన సాధకుడప్పుడిక ఆరురుక్షువు కాదు. ఆరూఢుడవుతాడు. అయితే యోగారూఢస్య త స్యైవ
Page 454