#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఇలాటి సంకల్పాలు రెండూ వదిలేశాడు కాబట్టి యోగి వాస్తవంలో సన్న్యాసే. సన్న్యాసి అంటే వదిలేస్తున్నాడు కాబట్టి సన్న్యాసి. అయినా కర్మ చేస్తుంటాడు కాబట్టి యోగి. కర్మఫలం సన్న్యసిస్తాడు కాబట్టి మామూలు సన్న్యాసి కాడు. కార్యమైన కర్మ చేస్తుంటాడు కాబట్టి మామూలు యోగి కాడు వీడు. ఇద్దరి కంటే విలక్షణమైన మూడవ మార్గం వీడిది. ఇందులో ఇంకా విశేష మేమంటే కర్మ చేయటం చేయక పోవటం కాదు ముఖ్యం. చేయకుండా విడిచిపెట్టిన మాత్రాన సన్న్యాసం కాదు. చేయమన్నారు గదా అని ఫలాసక్తి వదలకుండా చేస్తే యోగమూ కాదు. మరేమిటి. సంకల్పమేదీ ఉండగూడదు. అయినా కర్తవ్యమైన కర్మ వదులుకో గూడదు. దీనిబట్టి పరుగెత్తి పోవటం కాదు సన్న్యాసం. గుడ్డిగా చేస్తూ పోవటం కాదు యోగం. లేదా అదీ మానేసి ధారణా ధ్యానాదుల్లో మునిగి పోవటమూ కాదు. అనాసక్తుడై చేస్తుండాలి మానవుడు. అనాసక్తిలో సన్న్యాసముంది. చేయటంలో యోగముంది. సంకల్ప త్యాగం లేకుండా కర్మ చేయటం లేదు కాబట్టి సన్న్యాసమూ యోగమూ రెండూ ఒకటే వాడి విషయంలో.

  ఇది ఎలాటిదంటే ఏకం సాంఖ్యంచ యోగం చయః పశ్యతి స పశ్యతి అన్నాడే పంచమాధ్యాయంలో అది గుర్తుకు తెస్తున్నదీ శ్లోక భావం. విమర్శించి చూస్తే అక్కడ చెప్పిందీ ఇక్కడ చెప్పిందీ రెండూ ఒకటేనా అని తోస్తుంది భావుకుడైన వాడి మనస్సుకు. సాంఖ్యం యోగం రెండూ చెప్పి అవి రెండూ ఒకటేనని చాటుతున్నా డిక్కడ. ఏమి టింతకూ వ్యాస

Page 452

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు