
రూపమైన కర్మ నాత్మ రూపమైన జ్ఞానం గడించటానికి కర్మయోగంగా మార్చుకొని పాటించగలవు. కర్మయోగంలో ఉత్తీర్ణుడ వైనప్పుడే ఆత్మను గుర్తించే జ్ఞానయోగం నీకు ఒంట బడుతుంది. జ్ఞానం ఒంట బట్టిందంటే అంతవరకూ కర్మగా సాగిన అనాత్మ కూడా ఆత్మగానే భాసించి కర్మలన్నీ జ్ఞానంలో సన్న్యసించటమనే కర్మ సన్న్యాసయోగ మాకళింతకు వచ్చి తీరుతుంది. అదే జీవిత సమస్య అయిన విషాద యోగానికి భరత వాక్యం పలుకుతుంది. అంచేత ఇది చాలా ముఖ్యమైన కీలకస్థాన మీ ఆత్మ సంయమమనే ఆరవ అధ్యాయం గీతలో. అందుకే నేమో దాని ప్రాశస్త్య మెలాటిదో ప్రారంభంలోనే కీర్తిస్తున్నాడు వ్యాసభగవానుడు.
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః || 1 ||
చేసే కర్మల ఫలితాన్ని ఆసించకుండా ఎవడైతే చేయవలసిన కర్మలన్నీ మానేయకుండా చేస్తుంటాడో - స సన్న్యాసీ చ. వాడే అసలైన సన్న్యాసి. యోగీచ. వాడే అసలైన యోగీ కూడా నని చాటుతున్నది గీత. సన్న్యాస మన్నా యోగమన్నా లోకుల కేవేవో అభిప్రాయాలున్నాయి. గృహస్థాశ్రమం సన్న్యసించి పరుగెత్తి పోవటం సన్న్యాసమని - బాహ్యమైన కర్మకాండ వదిలేసి కేవలం కండ్లు మూసుకొని ధారణా ధ్యాన సమాధు లవలంబించి కూచోటం యోగమని మనకు కొన్ని అపోహ లున్నాయి. ఇలాటి అపోహలన్నీ త్రోసి పుచ్చుతున్న దిప్పుడు భగవద్గీత. కర్మలన్నీ సన్న్యసించి
Page 448
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు