ఆత్మసంయమ యోగము
భగవద్గీత
ఆత్మల నన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి మొదట సాధకుడు. ఆత్మకు భిన్నంగా ఇవి ఉన్నాయని భావించకూడదు. అదీ అదుపు చేయటమే అసలైన దాన్ని పట్టుకోవాలంటే ఇవి దాని దారి కడ్డు తగలగూడదు గనుక దానికడ్డు లేకుండా చేసుకోటం కూడా అదుపు చేయటమే. ఆత్మ సంయమ మంటే ఇది.
ఇప్పుడు దీనిమీద ఆధారపడి ఉంది మన ప్రయాణమంతా. మోక్షమార్గంలో గదా మన ప్రయాణం. దానికి కావలసింది కేవలమాత్మ జ్ఞానమే అయినా అది కలగాలంటే దేహేంద్రియాదు లడ్డు రాగూడదు. మీదు మిక్కిలి మన పురోగతి కంత కంతకు తోడు పడాలివి. సహజంగా శత్రువులూ కావవి మిత్రులూ కావు. నీవు వాటిని చూచే చూపును బట్టి ఉంటుంది వాటి వ్యవహారం. ఆత్మ దృష్టితో చూస్తే అవి మిత్రులే నీకు. అనాత్మ దృష్టితో చూచావో గర్భ శత్రువులు. కనుక బలవన్మాఘ స్నానంగా వాటిని నిగ్రహించటం కాదు నీవు చేయవలసింది. అలా చేస్తే అవి రెచ్చి పోతాయి. అది గాదు ఆత్మ సంయమనం. ఆత్మ తత్త్వమనే గమ్యం వైపు నీవు పయనిస్తూ వాటి నా గమ్యం వైపు నీతోపాటు తీసుకువెళ్ల గలిగి ఉండాలి నీవు. అదే అసలైన ఆత్మ సంయమం.
అది ఎలాగో చక్కగా వివరించటానికే వచ్చిందీ అధ్యాయం. జరిగిపోయిన అధ్యాయా లన్నిటికీ ఇదే మూలం. ఇదే పునాది. మనః ప్రాణేంద్రియాదులు నీ మాట విని నీతో పాటు సాగి వస్తేనే నీవు ఆత్మా నాత్మ వివేచన చేయగలవు. అలాటి సాంఖ్యం జరిగినప్పుడే అనాత్మ
Page 447