#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఇది వాకిలి - ఇది భార్య - ఇది సంతాన - మిది సుఖమిది దుఃఖమని పేర్కొంటున్నప్పు డవన్నీ ఎవరికి చెందిన వని అడిగితే ఏమని జవాబిస్తావు. ఇదంతా నాదనే గదా అంటావు. నేననే భావ ముండకపోతే నాదనే మాట ఎలా అనగలిగావు. కాబట్టి నేనూ నేనే. నాదీ నేనే. అంతా నేననే భావంతోనే పట్టుకొంటున్నావు - దాన్ని వదిలేసి నిన్నూ పట్టుకోలేవు. నీదీ పట్టుకోలేవు. అంతా రామమయ మన్నట్టు అంతా అహంతామయం.

  ఇలాంటి అహంతా లేదా నేననే స్ఫురణలోనే సమస్తమూ నీకు స్ఫురిస్తున్నప్పుడు దాన్ని వశంలో పెట్టుకొనట మేమిటి అని ప్రశ్న. ఆత్మ అంటే ప్రత్యగాత్మ అని గాదిక్కడ అర్థం. ఇంకా ఉన్నాయి ఆత్మలు చాలా. భూతాత్మా ఆత్మే. దేహాత్మా ఆత్మే. ప్రాణాత్మా ఆత్మే. బుద్ధ్యాత్మా ఆత్మే. అహంకార మనే కర్రాత్మా ఆత్మే. ఇన్ని ఆత్మ లున్నాయి. ఉన్నాయంటే స్వతహాగా లేవవి. నేననే భావమున్న దొక్కటే. దానినే ప్రత్యగాత్మ అంటారు. మిగతా ఇప్పుడు చెప్పినవన్నీ ప్రత్యక్ Intro కావు. పరాక్ Extro. ఆత్మాభాస లివి. అసలైన ఆత్మకావు. నేననే జ్ఞాన ప్రకాశం దేహేంద్రియ మనః ప్రాణాదుల మీద పడి వాటినే నేనని భావించి వ్యవహరిస్తున్నాము మనం. మన ఈ వ్యావహారికమైన దృష్టిని బట్టి అసలైన ఆత్మ కాకున్నా ఆత్మ అని లోకదృష్టి ననుకరించి పేరు పెట్టి చెబుతున్నది శాస్త్రం కూడా వీటన్నిటినీ. ఇలాటి నకిలీ ఆత్మల మూలంగానే అసలైన మన ప్రత్యగాత్మ నిదమిత్థ మని మనం గుర్తించ లేకపోతున్నాము. కాబట్టి ఇదుగో ఈ ఆత్మగాని

Page 446

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు