#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత







6. ఆత్మ సంయమ యోగము

  అయిదధ్యాయాలు దాటి వచ్చి ప్రస్తుత మాత్మ సంయమమనే ఆరవ అధ్యాయంలో ప్రవేశించాము. దీని కాత్మ సంయమమని పేరు పెట్టటంలో ఎంతైనా ఉంది అంతరార్ధం. సంయమమంటే నిగ్రహించటం. అరికట్టటం అదుపులో ఉంచుకోటమని మామూలుగా చెప్పుకొనే అక్షరార్ధం. దేన్ని అదుపులో ఉంచుకోవాలని ప్రశ్న వస్తే ఆత్మనని చెబుతున్నది గీత. ఆత్మ అంటే ఏమిటాత్మ. మనకున్న ఆత్మ ఒక్కటే. అది చైతన్య స్వరూపం. నేనే. నేననే స్ఫురణ మాత్రమే అది. మరేదీ గాదు. అలాటి ఆత్మను అదుపులో పెట్టటమేమిటి. అదే అన్నింటినీ అదుపులో పెడుతున్నదా మాటకు వస్తే. మొదట నేను అని అనుకొంటే గాని తరువాత మరేదైనా ఉందని అనుకోలేము. మరొకటి ఉందని చూస్తున్నప్పుడు కూడా నేననే దాని స్పర్శ లేకుండా దేన్నీ గమనించలేము మనం. ఇంతెందుకు. ఇది ఇల్లు

Page 445

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు