కర్మసన్యాస యోగము
భగవద్గీత
కర్మయోగమనే అర్ధం చెప్పింది గీత. కాబట్టి మామూలు యజ్ఞయాగాలని మామూలుగా చేసే తపశ్చర్య అని భ్రాంతి పడరాదు. మానవు డేకర్మ చేసినా మనసులో ఏ విషయాన్ని భావించినా - వాటికీ జీవుడు కర్త గాడు. భోక్తా కాడు. అన్నిటికీ కర్తా భోక్తా ఈశ్వరుడే. ఆయనే సర్వలోక మహేశ్వరుడు. అలా భావన చేస్తూ పోవాలి మానవుడు. అలా చేస్తే వీడి జీవభావ మెగిరి పోతుంది. ఈశ్వర భావమెలాంటిదో దర్శనమిస్తుంది. అది ఈ పిండ శరీరాన్నే గాక విశ్వ శరీరాన్ని అంతటినీ అధిష్ఠించి ఉన్నట్టు కూడా అనుభవానికి వస్తుంది.
అంతేకాదు. సుహృదం సర్వభూతానాం - సమస్త భూతాల హృద యంలో కూడా అదే తిష్ఠ వేసుకొని కూచున్నట్టుగా కూడా స్ఫురిస్తుంటుంది. మొత్తం మీద అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని రెండింటినీ వ్యాపించి జీవుడు చేసే ప్రతి చేష్టనూ ప్రతి ఆలోచననూ వ్యాపించి ఒకే ఒక ఈశ్వర తత్త్వముందనే అద్భుతమైన సత్యాన్ని గుర్తించటమే జ్ఞానం. ఇలాటి జ్ఞానంతో అలాటి జ్ఞేయాన్ని స్వానుభవానికి తెచ్చుకోగలిగితే ఇంకేమి కావాలి మానవుడికి. జ్ఞాత్వామాం శాంతి మృచ్ఛతి. అలా నన్ను పట్టుకొంటే శాంతి అనేది తప్పకుండా లభిస్తుందని హామీ ఇస్తున్నాడు భగవానుడు. శాంతి అంటే సర్వసంసారో పరమమని అర్థం వ్రాస్తున్నారు భాష్యకారులు. సంసారమనే సమస్య అక్కడికి తీరిపోతుందంట. అంటే మోక్షం కరతలామల కంగా అనుభవానికి వస్తుందని తాత్పర్యం.
కర్మసన్న్యాస యోగః సమాప్తః
Page 444