#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

పోవటం కాదు సన్న్యాసం. కర్మలుచేస్తూనే ఉండాలి. కాని అనాశ్రితః కర్మఫలం. కర్మాచరణ వల్ల కలిగే స్వర్గాది భోగాలూ - జన్మాంతర సుఖాలూ ఏలాటి ఫలం మీదా నీకు ఆసక్తి ఉండగూడదు. నిష్కామంగా ఆచరించాలి కర్మ. అలాటి నిష్కామ కర్మ యోగమే నిజంలో సన్న్యాసమనే మాట కర్ధం.

  అలాగే యోగమనేది కూడా కేవలం యోగులు చెప్పే అష్టాంగ యోగాభ్యాసం కాదు. యోగులు చెప్పేది సమాధి. ఇది సమాధి గాదు వ్యవహారం. కర్మ ఫల మాసించక పోవటం సన్న్యాసమైతే ఫలాసక్తి లేకుండా కర్మ చేయటం యోగం. అప్పటికి సన్న్యాసం కర్మ ఫలంలోనే గాని కర్మలో గాదు. యోగం వ్యవహారంలోనే గాని సమాధిలో గాదు. మొత్తానికి ఫలాసక్తి లేకుండా సన్న్యాసి అయ్యాడు. కర్మ మానేయకుండా చేస్తుంటాడు కాబట్టి యోగి అయ్యాడు మానవుడు. సన్న్యాసీచ యోగీచ సన్న్యాసీ వాడే యోగీ వాడే. రెండు బిరుదులూ వాడికే ప్రదానం చేస్తున్నది గీత.

  మరి రెండూ కర్మయోగికే అయితే లోకంలో సన్న్యాసులూ యోగులూ అని చెలామణి అయ్యే వారంతా ఏమయి పోవాలని అడిగితే వాడు సన్న్యాసీ కాదు. యోగీ కాదు పొమ్మంటున్నది గీత న నిరగ్ని ర్నచా క్రియః - అగ్ని కార్యం చేయనివాడు నిరగ్ని. గృహస్థాశ్రమంలోనే అగ్నిహోత్రాలు. అవి చేయనివాడైతే వాడు గృహస్థుడుగాడు సన్న్యాసి అంటారు మాములుగా. అలాగే అక్రియః శారీరకంగా ఏ కర్మా పెట్టుకోక మానసికంగా ధ్యానం చేసేవాడు అక్రియుడు. వాడే యోగి. మామూలుగా లోకవ్యవహారాన్ని

Page 449

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు