#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

బట్టి వాడు సన్న్యాసి వీడు యోగి అని చెలామణి కావచ్చు. కాని అది నామమాత్రమే. యాంత్రికమైన ప్రవర్తన అది. ఆత్మ జ్ఞానానికి తోడ్పడే అనులోమ మార్గం Positive కాదది. ప్రతిలోమం Negative. ఫలాన్ని సన్న్యసించకుండా కేవలం కర్మ మాత్రం సన్న్యసిస్తే అది జ్ఞానానికెలా తోడ్పడుతుంది. అలాగే అసలు ప్రయత్నమే మానేసి కూచుంటే అది ఎలా సహాయ పడుతుంది. కర్మ చేయవలసిందే - చేసే ప్రతి కర్మా అనాసక్తంగా చేయవలసిందే. అప్పుడే అది అహం మమలనే సంకుచిత దృష్టి తొలగించి నీకు సాక్షి రూపమైన ఆత్మను పట్టుకోటానికి దోహదం చేస్తుంది. అంతేగాని కర్మ కర్మ కోసం గాదు. సన్న్యాసం సన్న్యాసం కోసం గాదు. జ్ఞానం కోసం కర్మా. జ్ఞానం కోసమే సన్న్యాసమని భావించాలి మనం. అలా కాకపోతే సన్న్యాసం తీసుకొంటే చాలు వాణ్ణి జ్ఞాని అనీ - హఠయోగాదులతో కాలం గడపినా చాలు వాణ్ణి జ్ఞాని అనీ - అనవసరంగా కనపడ్డ ప్రతి సన్న్యాసినీ యోగినీ కొండమీద కూచో బెట్టవలసి వస్తుంది. అది మహాపరాధం. కనుక వీరందరూ కారు. వాడే అసలు సన్న్యాసి అయినా యోగి అయినా. వాడే దానికి తగినవాడని తేల్చి చెబుతున్నది శాస్త్రం.

యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2 ||

  అంతేకాదు. డొంక తిరుగుడుగా చెప్పటం దేనికి. సూటిగా బాహాటంగానే చెబుతాము. సన్న్యాసం యోగమనే భావాలు మరెక్కడా

Page 450

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు