మనసులో బ్రహ్మాకార వృత్తి ఉదయిస్తుంది. అది బ్రహ్మాన్ని చూపుతుంది. ఆ వృత్తే జ్ఞానం అదే ప్రమాణం. అందులో ప్రతిఫలించే బ్రహ్మమే ప్రమేయం. అంచేత కర్మధ్యానా లుపాయమైతే జ్ఞానమనేది ఉపేయమన్నారు భగవత్పాదులు.
ప్రస్తుతం ధ్యానయోగమనే ఉపాయ మెలా టిదో అది ఎలా మన మవలంబించాలో వర్ణిస్తున్నది గీత. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శలంటే శబ్దాదులు. వాటిని ముందు బయటికి పంపించాలి. అవి అసలు బయటనే ఉన్నాయి. కాని శ్రోత్రాదులైన ఇంద్రియాల ద్వారా వచ్చి మనసులో ప్రవేశిస్తుంటాయి. వాటిని మరలా మనసులో నుంచి బయటికే త్రోసివేయాలి. త్రోసి వేయటమంటే వాటిని ఫలానా అని మనసులో ఆలోచించక పోవటమే. ఆలోచించకుంటే అవి మనసుకు రావు. పోతే చక్షుర్దృష్టిని భ్రూమధ్యంలో ఉంచా లంటున్నది గీత. కంటిచూపు అటూ ఇటూ ప్రసరించకుండా ఒకేచోట నిలపాలని అర్ధం. కనుబొమ్మల మధ్య ఉన్నది సుషుమ్నానాడి. కుడి ఎడమలలో ఇడా పింగళా అనే నాడులు ప్రసరిస్తుంటాయి. దేనిమీద చూపు పెట్టినా అది విషమమే. సమం కాదు. సమం భ్రూమధ్యమే. రెండు కండ్ల చూపులూ ఒకే చూపుగా మారి అది భ్రూమధ్యాన్ని చూస్తే ఆకాశమే కనిపిస్తుంది. అంటే శూన్యంగా మారుతుంది. రూపాలేవీ కనిపించవు.
అంతేకాదు. ప్రాణాపానాలు న్నాయి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు. అవి రాకపోకలు చేస్తుంటే వాటి మీద పోతుంది మనసు. కనుక సమౌకృత్వా, వాటిని కదలకుండా కుంభకం చేయాలి. ఆపు చేయగలిగి ఉండాలి.
Page 442