
>
కూడా వర్ణించి చెప్పింది. అయిద ధ్యాయాలలో చెప్పిందీ జ్ఞానకర్మలే. పోతే ఇప్పుడీ జ్ఞానమూ కర్మా రెండే గాక మరొక యోగం కూడా పేర్కొంటున్నది గీత. ఏదోగాదది ధ్యానం. కర్మయోగం జ్ఞానానికి బహిరంగ మైతే External ఈ ధ్యాన యోగం జ్ఞానాని కంతరంగ Internal మని చెబుతారు భగవత్పాదులు. కర్మ బాహ్యంగా కనపడు తుంటుంది అందరికీ. ధ్యానమలా కనపడదు. ఇది కేవలం మానసికమైన వృత్తి Function. వృత్తిగాని వృత్తి. కనుక కర్మయోగం కన్నా బలవత్తర మైనది. కర్మయోగం గట్టిపడితే ధ్యానయోగంగా మారుతుంది. ధ్యానయోగ మింకా బలం పుంజుకొంటే జ్ఞానయోగంగా పరిణమిస్తుంది. ఇదీ వరస. చివరకు జ్ఞానమే ఇవ్వాలి మోక్షం. ఇవేవీ గావు. కర్మ ధ్యాన యోగాలు కేవలం మనస్సుకు శిక్షణ మాత్రమే. ఒకటి చిత్రానికి శుద్ధి Purification మరొకటి ఏకాగ్రతా Concentration ప్రసాదిస్తాయి. అదే జ్ఞానం కాదు. జ్ఞానమనేది ప్రమాణం Congnition కర్మా ధ్యానం ప్రమాణాలు కావు. ప్రమాణమే ప్రమేయం To be Cognised తాలూకు అనుభవాన్ని అందజేస్తుంది. ప్రమేయ మిప్పుడు మనకు బ్రహ్మం. అది ఇదమిత్థమని పట్టి ఇచ్చేది ప్రమాణభూతమైన జ్ఞానమే గాని కర్మాదులు గావు. ఇది సుఖమని అనుభవానికి రావాలంటే జ్ఞానంవల్లనే గదా రావాలి. సుఖాకార వృత్తే జ్ఞానం. అలాగే బ్రహ్మాకార వృత్తి కూడా జ్ఞానమే. కర్మ అలాటి వృత్తిగాదు. ధ్యాన మంత కన్నా కాదు. అవి ఇలాటి వృత్తి కలగకపోతే దాని కవరోధం కల్పించే చెత్తా చెదారం ప్రక్కకు తోసివేస్తాయి. అంతమాత్రమే. కర్మ అహంమమ లనే చెత్తను తొలగిస్తే ధ్యానం ఆవరణ విక్షేపాలనే చెత్తను త్రోసి పారేస్తుంది. అప్పుడా
Page 441
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు