
ఎప్పుడూ బ్రహ్మదర్శనమే. జీవించి ఉండగా జీవముక్తి. జీవితానంతరం విదేహ ముక్తి. అసల నంతరమనే ప్రశ్న లేదు. ఎందుకంటే మరణం జ్ఞాని దృష్టిలో లేదు. జ్ఞాని బ్రహ్మమే అయినప్పుడు మరణ మెక్కడిది. జ్ఞాన ముంటే మరణం రాదు. మరణం జ్ఞానం తొలగినప్పుడే. తొలగటమనే ప్రసక్తిలేదు బ్రహ్మ జ్ఞానానికి. అది మనకున్న విశేషజ్ఞానం లేదా వృత్తి జ్ఞానం కాదు. సామాన్య జ్ఞానం. శరీరమనః ప్రాణాదులైన ఉపాధుల మీద ఆధారపడేది కాదా జ్ఞానం. ఇవి ఉన్నా లేకున్నా అది అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. అప్పుడే అది సామాన్య జ్ఞాన మనిపించు కోగలదు. అలాంటి పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడు వాడు. ఇక జీవిస్తే నేమి మరణిస్తేనేమి. తేడా రాదు. మరణం లేదనిచెప్పి మరలా మరణిస్తే అంటున్నారేమిటని శంకించవచ్చు. మరణం వాడి జ్ఞానానికి కాదు. ఆ జ్ఞానానికి జ్ఞేయ భూతమైన Known శరీరాది సంఘాతానికి. దాన్ని కూడా జ్ఞాన స్వరూపంలోలయం చేసుకొని చూస్తుంటాడు వాడు. కాబట్టి వాడికి శరీరాదులు కనిపించవు. కనిపించినా తన స్వరూపానికా భాసగా కనిపిస్తుంటాయి. కాలిపోయిన కాగితాల కట్టలాగా కనిపిస్తున్నా ఉపయోగం లేనివవి. ప్రారబ్ధం తీరితే అవి కూడా పతనమై అప్పటినుంచీ వస్తురూపంగానే అనుభవానికి వస్తుంటాయి జ్ఞానికి. కనుక జ్ఞాని ఎప్పుడూ ఒకే దశలో ఉంటాడు. జీవితమూ మరణమనే తేడా దృశ్యమైన ఉపాధికేగాని దృగ్రూపుడైన వాడికి లేదు.
అయితే ఇలాంటి మహోన్నతమైన దశ నందుకోవాలంటే సామాన్యం కాదు. కామక్రోధ వియుక్తానాం - యతీనాం - యత చేత
Page 436
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు